కన్నవారికి శోకం | - | Sakshi
Sakshi News home page

కన్నవారికి శోకం

Dec 6 2025 7:36 AM | Updated on Dec 6 2025 7:36 AM

కన్నవ

కన్నవారికి శోకం

కన్నవారికి శోకం క్షణికావేశం.. కన్నవారికి శోకం

గత నెల 29న కొమరాడ మండలం మాదలింగి గ్రామంలో తల్లిదండ్రులు ఉద్యోగానికి వెళ్లమని మందలించారన్న చిన్న కారణానికి 27ఏళ్ల బి.మధుసూదనరావు అనే యువకుడు మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడి తనువు చాలించాడు. భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి వెళ్లాల్సిన యువకుడు చిన్న మందలింపునకే ఆయువు తీసుకోవడం తల్లిదండ్రులకు తీరని కడుపుకోతను మిగిల్చింది.
క్షణికావేశం.. కన్నవారికి శోకం

మందలిస్తే మరణమేనా?

ఓర్పులేని తనం..బలవుతున్న జీవనం

చిన్నపాటి మనస్తాపాలకే బలవన్మరణాలు

ఆందోళన కలిగిస్తున్న వరుస విషాదాలు

పెంపకమే పునాది...

సంభాషణే పరిష్కారం

పిల్లలకు చిన్న నాటి నుంచే మంచి, చెడుల విచక్షణ నేర్పాలి. కోరినవన్నీ ఇవ్వడమే ప్రేమ అనుకోకూడదు. ఆ కోరికల వెనుక ఉన్న పర్యవసానాలను వారికి అర్థమయ్యేలా వివరించాలి. చిన్ననాటి నుంచి గారాబం చేసి పెద్దయ్యాక ఒక్కసారిగా వారిపై ఆంక్షలు విధిస్తే తట్టుకోలేరు. యవ్వనంలో వారిని మందలించడం కంటే మిత్రుడుగా మారి సమస్యను విశ్లేషించి నచ్చజెప్పాలి. వారి ఆసక్తులను గౌరవిస్తూనే అవి ఉన్నత భవిష్యత్‌కు ఏ విధమైన బాటలు వేస్తాయో నచ్చజెప్పాలి. వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేలా ప్రోత్సహించాలి. యువత కష్టమొస్తే కుమిలిపోకూడదు. తల్లిదండ్రులతో మనస్సు విప్పి మాట్లాడాలి. వారి అనుభవం, ప్రేమ ఏ సమస్యకై నా పరిష్కారం చూపుతాయని గుర్తించాలి.

– రష్మిత, మానసిక వైద్య నిపుణురాలు

యువకుడి ఆత్మహత్య

విజయనగరం క్రైమ్‌: పట్టణంలోని దాసన్నపేటలో గొల్లవీధికి చెందిన కోరాడ వీరేంద్ర (25) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. వీరేంద్ర మూడేళ్ల నుంచి నగరానికి చెందిన దుర్గ అనే అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడుస్తోంది.పెళ్లి చేసుకుందామని ఇద్దరూ నిర్ణయించుకుని ప్రేమ వ్యవహారం ఇరుకుటుంబాల పెద్దలకు తెలియచెప్పారు. ప్రస్తుతం పెళ్లిముహూర్తాలు లేవని, మూడు నెలలు ఆగాలని వీరేంద్ర తరఫున అమ్మానాన్నలు అమ్మాయి కన్నవారికి చెప్పి మిన్నకున్నారు. అయితే అమ్మాయి మాత్రం అత్యవసరంగా తన మెడలో తా ళి కట్టాలని వీరంద్రపై ఒత్తిడి చేసింది. ముహూర్తాలు లేకపోయినా, పెళ్లి చేసుకోవాలని ప్రేమించిన యు వతి ఒత్తిడి చేయడంతో ఇంట్లో చెప్పలేక వీరేంద్ర తీవ్ర ఘర్షణ పడ్డాడు. ఆపై మనో వేదన చెందాడు. కొడుకు మనోవ్యథను కళ్లారా చూసిన వీరంద్ర తల్లిదండ్రులు మీ ఇద్దరి పెళ్లి సింహాచలంలో చేస్తామని ఆగాలని తొందర పడొద్దని నచ్చజెప్పారు. కానీ అంతలోనే ఏమైందో ఏమో గానీ శుక్రవారం ఉదయాన్నే తన ఇంట్లోని మేడపైకి వెళ్లిన వీరేంద్ర ఫ్యాన్‌ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సమాచారం తెలుసుకున్న టూటౌన్‌ సీఐ టి.శ్రీనివాసరా వు, ఎస్సై కనకరాజు లు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీ లించారు. కన్నవారు, స్థానికుల నుంచి వివరాలు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని సీఐ శ్రీనివాస్‌ చెప్పారు.

పార్వతీపురం రూరల్‌: జీవితం ఒక యుద్ధం..పోరాడి గెలవాలి. కానీ నేటి యువత ఆయుధం చేతపట్టకముందే చేతులెత్తేస్తోంది. సమస్య ఎదురైతే పరిష్కారం వెతకాల్సిందిపోయి ప్రాణం తీసుకోవడమే పరమావధిగా భావిస్తోంది. ‘ఛీ’ అంటే చిన్నబుచ్చుకోవడం ‘వద్దు’ అంటే విగతజీవిగా మారడం నేటి యువతకు పరిపాటిగా మారింది. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబకలహాలు, ప్రేమ వ్యవహారాలు ఇలా కారణమేదైనా పర్యవసానం మాత్రం మరణంగానే మారుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

ఉద్వేగమే ఉరితాడై..

నేటితరం ఉద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోతోంది. క్షణికావేశంలో తీసుకుంటున్న నిర్ణయాలు నిండు నూరేళ్ల జీవితాన్ని సమాధి చేస్తున్నాయి.

ప్రేమలో ప్రమాద ఘంటికలు

ప్రేమంటే రెండు మనస్సుల కలయిక మాత్రమే కాదు. బాధ్యత కూడా అని మరిచిపోతున్నారు.

● గతేడాది ఆగస్టు నెలలో పాచిపెంటలో జరిగిన ఘటన ప్రేమికుల అనాలోచిత నిర్ణయాలకు ఆద్దం పట్టింది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి జరగలేదన్న బాధతో ఓ యువతి ఆత్మహత్య చేసుకోగా అక్క మృతిచెందిన ఆలోచనను తట్టుకోలేక ఆమె చెల్లెలు కూడా బలవన్మారణానికి పాల్పడడం స్థానికులను కంటతడిపెట్టించింది.

● అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌లో సాలూరు పరిధిలో వెలుగు చూసిన ఘటన ప్రేమ ముసుగులో జరిగిన ఘాతుకాన్ని బయటపెట్టింది. పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిన పాపానికి ప్రియరాలిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రియుడు ప్రయత్నించడం సభ్య సమాజాన్ని ఉలికిపాటుకు గురిచేసింది.

మానిసిక స్థైర్యమే రక్ష

జీవితంలో ఎత్తు, పల్లాలు సహజం. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా కుటుంబసభ్యులతో పంచుకుంటే పరిష్కారం లభిస్తుంది. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదు. అది పలాయనవాదం. తల్లిదండ్రులు కూడా పిల్లలతో స్నేహ పూర్వకంగా చిన్న నాటి నుంచే వారితో మెలుగుతూ, వారిలో మానసిక స్థైర్యాన్ని నింపాల్సిన అవసరం ఎంతైనా ఉందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.

కన్నవారికి శోకం1
1/2

కన్నవారికి శోకం

కన్నవారికి శోకం2
2/2

కన్నవారికి శోకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement