తమ్ముడి పెత్తనం..!
న్యూస్‌రీల్
–8లో
ఆ పదవి నాకు ఆనదు...
అన్న పదవితో..
ఆ నియోజకవర్గంలో అధికారం అన్నది.. కానీ.. పవర్ అంతా తమ్ముడిదే. ఆయన కనుసైగ చేస్తేనే ఫైల్ కదులుతుంది. పని జరుగుతుంది. బదిలీల నుంచి ఇసుక అక్రమ తరలింపు వరకు.. సెటిల్‌మెంట్ల నుంచి.. భూ దందాల వరకు.. అన్నీ ఆయన కనుసన్నల్లో జరగాల్సిందే. షాడో ప్రజాప్రతినిధిగా కొనసాగుతూ.. ఆ నియోజకవర్గ ప్రజలపై ‘జగదీశ్వరుడి’ రూపంలో పెత్తనం సాగిస్తున్నారు. అవినీతి, అక్రమ వ్యవహారాలతో హడలెత్తిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
గురువారం శ్రీ 6 శ్రీ నవంబర్ శ్రీ 2025
గతంలో పెద్ద పదివి చేశారు. మళ్లీ అదే పదికి కోసం పావులు కదిపినా దక్కలేదు. అప్పట్లో మందీమార్బలంతో ముందుకు సాగి... ఇప్పుడు ఈ చిన్నపదవిని పట్టుకుని ఊళ్లోకి రావడమంటే ఆయన ఇష్టపడడం లేదట. ఈ మాటను పార్టీ క్యాడర్ వద్దే పలు మార్లు ప్రస్తావించారు కూడా. అందుకే.. విశాఖలోనే మకాం వేసి కాలేజీలు.. ఇతరత్రా వ్యాపారాలు చూసుకుంటూ.. నియోజకవర్గాన్ని ‘జగదీశ్వరుడికి’ దత్తత ఇచ్చేశారట. దీంతో తమ్ముడు బాధ్యతలేని అధికారాన్ని చెలాయిస్తూ చెలరేగిపోతున్నారని ఆ పార్టీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. తమ్ముడు తరచూ శ్రీకాకుళం నుంచి రాజాం రావడం.. గెస్ట్ హౌస్‌లో ఉంటూ సమావేశాలు, అధికారిక సమీక్షలు నిర్వహిస్తూ షాడో నేతగా అన్న పదవిని పూర్తిస్థాయిలో వినియోగించుకుంటున్నారు. ఇటీవల అమ్మవారి జాతర పేరుతో ఒక్కో వ్యాపారి నుంచి కనీసం రూ.10 వేలు నుంచి అత్యధికంగా రూ.5 లక్షల వరకు అక్రమ వసూళ్లు చేశాసినట్టు తెలిసింది. వ్యాపారులను బెదిరించి వసూళ్లకు దిగడం, సెటిల్మెంట్లు పేరుతో భూములను బినామీల పేరును రాయించడంలో తమ్ముడు పెద్ద ఛాంపియన్ అంటూ పలువురు బహిరంగంగానే విమర్శిస్తుండడం గమనార్హం.
విజయనగరం జిల్లాలోనే అతిపెద్ద ఇసుక నిల్వలు నాగావళి పరీవాహక ప్రాంతమైన రేగిడి, సంతకవిటి మండలాల్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి అక్రమంగా రేయింబవళ్లు ఇసుక తవ్వుతూ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, ఇలా ఎక్కడకు కావాలంటే అక్కడకు సరఫరా చేస్తూ రూ.కోట్లు పోగేస్తున్నారు. తనకు నచ్చిన, తన మనసెరిగిన అధికారులు ఎక్కడున్నాసరే బదిలీద్వారా.. అది కుదరకపోతే డిప్యుటేషన్ ద్వారా తన ఇలాకాలోకి తెప్పించుకుని దందా నడపడం తమ్ముడి స్టైల్. ఇసుక లారీల రాకపోకలతో రోడ్లు పాడవుతున్నాయంటూ పలు గ్రామాల ప్రజలు తరచూ ఆందోళనలు చేస్తున్నారు. యువకులైతే లారీలను అడ్డుకుంటున్నారు. ఆ సమయంలో తమ్ముడే రంగంలోకి దిగడం, యువకులను బెదిరించి లారీలను ముందుకు నడుపుతుండడం పరిపాటిగా మారింది. ఈ ఐదేళ్లు ఎలాగోలా భరించేద్దాం.. ఆయనతో గొడవలకు దిగొద్దంటూ యువకులకు ఆ పల్లె పెద్దలు నచ్చజెబుతున్నారు. ఆయనకు ఎలాంటి పదవి లేకున్నా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడం, ప్రారంభోత్సవాలు చేస్తుండడం అధికారులకు సైతం తలనొప్పిగా మారిందన్నది టాక్. దీనిపై పొరపాటున ప్రశ్నిస్తే ఉద్యోగాలు ఉండవని, ఎక్కడికో బదిలీ అయిపోతామంటూ అధికారులు లోలోన గుబులు చెందుతున్నారు. కొందరు అనుచరులు మాత్రం తమ్ముడితాలూకా అంటూ దందాలు సాగిస్తుండం ఆ నియోజకవర్గంలో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
సాక్షిప్రతినిధి విజయనగరం:
ఆ నియోజకవర్గ ప్రజలు పదివిని ఒకరికి కట్టబెట్టారు. మరొకరి పెత్తనంతో ఇప్పుడు నలిగిపోతున్నారు. ఇదెక్కడి షాడో నేత పాలనరా ‘బాబూ’ అంటూ కుర్రోమొర్రో అంటున్నారు. అప్పుడెప్పుడో ఒకసారి అదృష్టవశాత్తు అన్నకు పెద్ద పదవి దక్కింది. రాజును చూసిన కళ్లతో మొగుణ్ణి చూస్తే మొత్తబుద్ధి అవుతుందట.. ఇప్పుడు ఆ ప్రజాప్రతినిధికి అలాగే అనిపిస్తోంది. ఒకసారి పెద్ద పదవి అనుభవించాక మళ్లీ చిన్న పదవిని చేపట్టడం నామోషీగా అనిపిస్తుందేమో మరి.. కలెక్టర్ ఉద్యోగం చేశాక బిల్లు కలెక్టర్ పోస్టింగ్ అంటే ఇముడ్చుకోవడం కష్టమే కదా.. అందుకే.. బినామీగా తన తమ్ముడిని అక్కడ ప్రతిష్టించి ఆయన వైజాగ్‌లో ఉంటూ పెద్దపెద్ద డీల్స్ చేస్తూ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం మానేశారట. దీంతో బాధ్యతలేని అధికా రాన్ని ఎంజాయ్ చేస్తున్న తమ్ముడు అదీఇదీ అని లేకుండా చెలరేగిపోతున్నారు. ఎదురు తిరిగే వారిపై ‘కోండ్రు’మంటూ గర్జిస్తున్నారు. నియోజకవర్గంలోని గుమస్తా పోస్టింగ్ దగ్గర్నుంచి ఆఫీసర్ పోస్టులవరకూ అన్నీ ఆయన కనుసన్నల్లోనే జరగాలని హుకుంజారీ చేశారు. ఎవరికి ఏ చిన్న పని కావాలన్నా ఆయన దగ్గరకు వెళ్లాల్సిందే. ఏ పని అవ్వాలన్నా ఆయన తమ్ముడి తాలూకా కావాల్సిందే. దీంతో అంతిమంగా నియోజకవర్గంలో ఆఫీ సర్లు, కాంట్రాక్టర్లు, కార్యకర్తలు కూడా తమ్ముడి తాలూకా అని చెప్పుకుంటూ గడిపేస్తున్నారు.
ఎస్.. సార్.. అనాల్సిందే..
పార్టీ కార్యక్రమాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఒకటేమిటి.. అన్నీ తమ్ముడే చక్కబెడుతూ.. ఏమ్మా.. ఇంతకన్నా ఎవరు సేవ చేస్తారు అంటూ.. క్యాడర్‌ను చూసి కళ్లెగరేస్తున్నారు. దీంతో ఎందుకొచ్చిన గొడవ అంటూ కార్యకర్తలు, ఆఫీసర్లు కూడా ఎస్..సార్.. అనేస్తున్నారు. లేదంటే ఆయనకు కోపమెక్కువట. ఆగ్రహిస్తే తట్టుకోలేరట. ఎంతో కష్టపడి ఏళ్ల తరబడి చదివి ఉద్యోగాలు సాధించి.. ఇప్పుడు ఏ అధికారం లేకపోయినా హల్‌చల్ చేస్తున్న వ్యక్తితో మనకెందుకులే అంటూ తలఊపుకుని వెళ్లిపోతున్నారట. ఈ మాటలు పలు ప్రభుత్వ కార్యాలయాల్లో తరచూ ఉద్యోగుల మధ్య జరుగుతున్నవే కావడం గమనార్హం.
ఇసుక మాఫియా
వెనుక ‘తమ్ముడు’
పదవి అన్నది.. అధికారం తమ్ముడిది..!
కాంట్రాక్టులు, కమీషన్ల వ్యవహారాలన్నీ తమ్ముడి కనుసన్నల్లోనే..
ఏలుకో ‘జగదీశ్వరా’ అంటూ
అన్న అభయం!
బదిలీల నుంచి ఇసుక అక్రమ సరఫరా వరకు అన్నీ ఆయన ఆధ్వర్యంలోనే..
ఆయనంటే అధికారులకు హడల్..
ఇదెక్కడి పాలన అంటూ విస్తుపోతున్న జనం
తమ్ముడి పెత్తనం..!


