ముంచేసిన మోంథా | - | Sakshi
Sakshi News home page

ముంచేసిన మోంథా

Oct 30 2025 7:41 AM | Updated on Oct 30 2025 7:41 AM

ముంచే

ముంచేసిన మోంథా

ముంచేసిన మోంథా ● ఖరీఫ్‌ సాగుపై తుపాను ప్రభావం ● నీట మునిగిన వరిని చూసి లబోదిబోమంటున్న రైతులు ● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు చివరిలో.. నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ● కలెక్టర్‌ డా.ఎన్‌.ప్రభాకర రెడ్డి

● ఖరీఫ్‌ సాగుపై తుపాను ప్రభావం ● నీట మునిగిన వరిని చూసి లబోదిబోమంటున్న రైతులు ● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు

చేతికి అందాల్సిన పంట కళ్ల ముందే నీట మునగడంతో పాలకొండ డివిజన్‌ పరిధిలో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఉదయాన్నే

పొలాలకు వెళ్లిన రైతులకు నీటి మునిగిన వరి పంట దర్శనమివ్వడంతో లబోదిబోమన్నారు. పాలకొండ మండలంలో సుమారు 300 ఎకరాల వరి పంట నీటమునిగినట్టు అంచనా. అప్పు చేసి వరి పంట వేశానని.. చేతికి అందే సమయానికి వర్షం నిలువునా ముంచిందని.. మొలకలు వచ్చే స్థితి ఏర్పడిందని రైతులు సుంకరి ధర్మ, గుమ్మిడి గోవింద ఆవేదన వ్యక్తంచేశారు. భామిని, సీతంపేట మండలాల్లోనూ ఇదే పరిస్థితి.

వంశధార నదీతీర ప్రాంతంలో వరితోపాటు, పత్తి పంట నేలకొరిగింది. వీరఘట్టం మండలంలో అరటి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పలు మండలాల్లో కూరగాయలు, ఇతర వాణిజ్య పంటలకు నష్టం వాటిల్లింది.

సాక్షి, పార్వతీపురం మన్యం :

మోంథా తుపాను తీవ్రత తగ్గింది. వర్షాలు, గాలులకు జిల్లాలో వివిధ పంటలకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా ఖరీఫ్‌ వరి కోత దశకు వస్తున్న సమయంలో కురిసిన వర్షం.. రైతాంగాన్ని కోలుకోలేని దెబ్బ తీసింది. మంగళవారం నుంచి బుధవారం ఉదయం 8 గంటల సమయానికి జిల్లాలో సగటు వర్షపాతం 42.9 మి.మీ.గా నమోదైంది. ఆ తర్వాత కూడా రోజంతా అడపాదడపా కురిసిన వర్షం 10.16మిల్లీమీటర్లగా నమోదైంది. తొమ్మిది పునరావాస కేంద్రాల్లో 532 మందికి ఆశ్రయం కల్పించారు. తుఫాన్‌ ప్రభావంతో జిల్లాలోని 10 మండలాల్లో 1591 ఎకరాల్లో వరి, మూడు మండలాల్లోని 161 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. 50 ఎకరాల్లో ఉద్యానవన పంటలకు నష్టం జరిగింది. మొత్తం 1802 ఎకరాల్లో పంట నీటమునిగినట్టు సంయుక్త కలెక్టర్‌ సి.యశ్వంత్‌కుమార్‌ రెడ్డి వెల్లడించారు. వర్ష ప్రభావం కొనసాగడంతో ఈ నష్టం మరింత పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.

●విద్యుత్‌ శాఖ పరిధిలో 29 ఎల్‌టీ స్తంభాలు, పాలకొండలో ఒక సబ్‌స్టేషన్‌కు సంబంధించి ఐదు ఎంవీఏ పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు, కొన్నిప్రాంతాల్లో నాలుగు డిస్ట్రిబ్యూషన్‌ట్రాన్స్‌ ఫార్మర్లు దెబ్బతిన్నా యి. 29 ఇళ్లు, 16.7 కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమయ్యాయి. 78 మంది గర్భిణులను గుర్తించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పాచిపెంటలో ఒక ఆవు, కురుపాంలో ఒక మేక మృతిచెందాయి.

పొంగిన గెడ్డలు

గాలులకు పలు చోట్ల విద్యుత్తు స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. ఒక్క సీతానగరం మండలంలోనే ఎనిమిది వరకు స్తంభాలు నేలవాలాయి. వీరఘట్టం మండలంలో వట్టిగెడ్డకు వరదనీరు పోటెత్తింది. కురుపాం మండలంలోని గుమ్మడిగూడ పంచాయతీ గుజ్జలగండ వద్ద గెడ్డ పొగి ప్రవహిస్తుండటంతో ప్రజల రాకపోకలు స్తంభించిపోయాయి. మక్కువ మండలం కవిరిపల్లి వద్ద కాజ్‌వేపై నుంచి గోముఖి నది పొంగి ప్రవహిస్తోంది. దీంతో స్థానికుల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. సాలూరు మండలం మరుపల్లి పంచాయతీ పరిధిలో సువర్ణముఖి నది పొంగి.. సమీపంలోని పత్తి, అరటి పంటలను ముంచేశాయి. మండలంలోని పలు ప్రాంతాల్లో అరటి, పత్తి, జొన్న, వరి, ఇతర పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. సుమారు మూడు అడుగుల మేర నీరు నిలిచిపోయింది.

పార్వతీపురం రూరల్‌: మోంథా తుఫాను అనంతర (పోస్ట్‌ డిజాస్టర్‌) పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌.ప్రభాకర రెడ్డి అధికారులను హెచ్చరించారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తత పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారని తెలిపారు. జేసీ యశ్వంత్‌ కుమార్‌ రెడ్డితో కలిసి అధికారులతో కలెక్టర్‌ బుధవారం సమీక్షించా రు. ప్రతి వీధి, గ్రామంలో నీటి నిల్వలను తొలగించి, తక్షణమే శుభ్రం చేయించాలని ఆదేశించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు తాగునీటి శుభ్రతకు చర్యలు చేపట్టాలన్నారు. పశు, వ్యవసాయ, శిథిల భవనాల నష్టాల అంచనాను జాప్యం లేకుండా పూర్తి చేయాలని సబ్‌ కలెక్టర్లు, తహసీల్దార్లు, మండల అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. గర్భిణులను మరికొన్ని రోజులు ఆస్పత్రుల్లో ఉంచాలని, చెరువులు నిండుగా ఉన్నందున గండ్లు పడకుండా ఇరిగేషన్‌, పంచాయతీరాజ్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. డిజాస్టర్‌ నిర్వహణలో నిర్లక్ష్యం చూపే సిబ్బందిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రిలీఫ్‌ కేంద్రాల్లో ఉన్న వారికి కిట్లు అందించాలని జేసీ యశ్వంత్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు.

తానవలస గ్రామంలో వరికి మొలకలు వచ్చిన దృశ్యం

పార్వతీపురం మండలం గంగాపురం పంచాయతీ తానవలస గ్రామంలో రైతుల పంట పొలాలు నీట మునిగాయి. తాడంగి రాము, కృష్ణ, మెల్లికి సింగురు తదితరులు వేసిన వరి... రెండు రోజులుగా నీటిలో ఉండిపోవడంతో ప్రస్తుతం మొలకలు వచ్చేస్తున్నాయి. మొలకెత్తిన ధాన్యాన్నీ ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు.

ముంచేసిన మోంథా 1
1/2

ముంచేసిన మోంథా

ముంచేసిన మోంథా 2
2/2

ముంచేసిన మోంథా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement