గవరమ్మపేట పంట పొలాల్లో ఏనుగుల గుంపు
జియ్యమ్మవలస: మండలంలోని గవరమ్మపేట పంటపొలాల్లో బుధవారం ఏనుగుల గుంపు సంచరిస్తోంది. గడిచిన మూడు నెలల నుంచి ఏనుగులు ఈ ప్రాంతా నికి రావడం లేదని పంటలు చేతికందుతున్న సమయంలో మళ్లీ రావడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వరి,అరటి పంటలు మరో నెల రోజులలో ఇంటికి వస్తాయని, ఇటువంటి సమయంలో మళ్లీ ఏనుగులు రావడంతో పంటకు నష్టం జరుగుతుందని వాపోతున్నారు. అంతేకాకుండా ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుందోనని భయాందోళన చెందుతున్నారు. ఏనుగులను ఈ ప్రాంతం నుంచి తరలించే ఏర్పాట్లు చేయాలని అటవీశాఖాధికారులను రైతులు కోరుతున్నారు.


