డ్రోన్లతో వృద్ధురాలి ఆచూకీ కోసం గాలింపు
జామి: మండలకేంద్రంలోని కొత్తలి వీధికి చెందిన కసిరెడ్డి కొండమ్మ (70) సోమవారం నుంచి కనిపించడం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై జామి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె గోస్తనీ నదివైపు బహిర్భుమికి వెళ్లిందని స్థానికులు చెప్పడంతో గోస్తనీనదిలో వృద్ధురాలు గల్లంతైనట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో జామి ఎస్సై జనార్దన్ డ్రోన్ల సహాయంతో ఆమె ఆచూకీ కోసం పరిశీలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో గురువారం మళ్లీ గాలింపు చేపడతామని పోలీసులు తెలిపారు.
డ్రోన్లతో వృద్ధురాలి ఆచూకీ కోసం గాలింపు


