●తుపాను ప్రభావిత కుటుంబాలకు నిత్యావసరాలు
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో తుపాను ప్రభావిత కుటుంబాలకు నిత్యావసర సరకుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నాం. 25 కిలోల బియ్యం(మత్స్యకారులకు 50 కిలోలు), కిలో రెడ్ గ్రామ్ దాల్, ఉల్లిపాయలు, బంగాళా దుంపలు, పంచదార కిలో చొప్పున, నూనె లీటరు ఉచితంగా అందజేయనున్నాం. ఈ సహాయం తుఫాన్ ప్రభావిత కుటుంబాలు, పునరావాస కేంద్రాల్లో ఉన్నవారికి, జీవనోపాధి దెబ్బతిన్న మత్స్యకారులకు అందనుంది. పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేస్తున్నాం. ప్రభుత్వ నిబంధనల మేరకు పంట నష్టం అంచనాలు ఉండాలని అధికారులకు సూచించాం. 33 శాతం కన్నా ఎక్కువ నష్టం వాటిల్లితేనే పంట నష్టాన్ని పరిగణలోకి తీసుకుంటారు. ఈ – పంట నమోదు తప్పనిసరి. సాగుదారుని మాత్రమే నమోదు చేయాలి. పంట నష్టం అంచనాలను ఆన్లైన్లో నమోదు చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించాం.
– సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి, సంయుక్త
కలెక్టర్, పార్వతీపురం మన్యం జిల్లా
●తుపాను ప్రభావిత కుటుంబాలకు నిత్యావసరాలు


