అంగన్‌వాడీ చిన్నారులకు త్రుటిలో తప్పిన ప్రమాదం
సీతంపేట: మండలంలోని మారుమూల ఉన్న బర్న గ్రామంలో అంగన్‌వాడీ భవనం శ్లాబ్ పెచ్చులు బుధవారం రాత్రి కూలాయి. చిన్నారులకు ప్రమాదం త్రుటిలో తప్పింది. ఇక్కడ 10 మంది ప్రీస్కూల్ పిల్లలు చదువుతున్నారు. రాత్రి సమయం కావడంతో ఎవ్వరూ అక్కడ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పిందని గ్రామస్తులు తెలిపారు. అంగన్‌వాడీ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో గోడలు కూడా బీటలు వారాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నానిపోయి పెచ్చులు ఒక్కొక్కటిగా పడుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నూతన భవనం మంజూరు చేయాలని, లేదంటే పాత భవనానికి అయినా మరమ్మతులు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.


