జాతీయస్థాయి తైక్వాండో పోటీలకు ముఖేష్‌మణికంఠ
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న స్కూల్‌గేమ్స్ తైక్వాండో పోటీలకు జిల్లాకు చెందిన ముఖేష్‌మణికంఠ ఎంపికయ్యాడు. నగరంలోని ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన ముఖేష్ ఈనెల 11,12 తేదీల్లో జరిగిన స్కూల్‌గేమ్స్ అండర్ 14 విభాగంలో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాడు. అంతేకాకుండా నాగాలాండ్‌లో ఈనెల 28 నుంచి 30వ తేదీ వరకు జరగనున్న అండర్ 14 జాతీయ స్థాయి తైక్వాండో పోటీలకు విజయనగరం నుంచి ఎంపికయ్యాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచడంతో పాటు జాతీయ పోటీలకు ఎంపికై న క్రీడాకారుడిని రాష్ట్ర తైక్వాండో అసోసియేషన్ కార్యదర్శి వేణుగోపాలరావు, జిల్లా ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, స్కూల్ గేమ్స్ సెక్రటరీ గోపాల్, విజయ, కోచ్ యశస్విని అభినందిస్తూ విజయంతో తిరిగి రావాలంటూ ప్రోత్సహించారు.


