జిల్లాలోని పలు శాఖా గ్రంథాలయాల్లో పాఠకులకు అవసరమైన సౌకర్యాలు లేకపోవడం వాస్తవమే. పలు లైబ్రరీలకు సొంత భవనాలు లేకపోవడం, మరుగుదొడ్లు, పాఠకులకు సరైన మౌలికవసతులు, కాంపిటేటివ్ పరీక్షలకు అవసరమైన పుస్తకాలు లేని పరిస్థితిని ఇటీవల జిల్లాలోని గ్రంఽథాలయాల సందర్శనలో గుర్తించాను. అయితే జిల్లాలో గ్రంథాలయ శాఖకు స్థానిక సంస్థలు చెల్లించాల్సిన దాదాపు రూ.4 కోట్ల బకాయిలు ఉన్నాయి. శాఖా గ్రంథాలయాలలో గుర్తించిన సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను. రౌతు రామ్మూర్తినాయుడు, ఏపీ గ్రంథాలయ పరిషత్ మెంబర్


