ప్రతిష్టాత్మకంగా చెస్‌పోటీలు నిర్వహించాలి
పార్వతీపురం రూరల్: జిల్లాలో నవంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న రాష్ట్రస్థాయి చెస్‌పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని కలెక్టర్ డా.ఎన్. ప్రభాకరరెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం సంబంధిత అధికారులతో సమీక్షించిన ఆయన పోటీలను విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. టోర్నీకి హాజరయ్యే 486మంది రాష్ట్రస్థాయి క్రీడాకారులను గౌరవంగా చూసుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన అథ్లెటిక్స్ క్రీడాకారులను కలెక్టర్ అభినందించారు
కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి


