అంతర్రాష్ట్ర రహదారికి మోక్షమెప్పుడో..?
ఆర్తాం డౌన్‌లో గోతుల మయం అవుతున్న అంతర్రాష్ట్ర రహదారి
కొమరాడ: పార్వతీపురం నుంచి కూనేరు వరకు గల అంతర్రాష్ట్ర రహదారి గోతుల మయం కావడంతో వాహనదారులు త్రీవ ఇబ్బందులు పడుతున్నారు. అయితే తూతూమంత్రంగా మరమ్మతులు చేపట్టారే తప్ప పూర్తిస్థాయి రహదారి పనులు చేపట్టాలని వాహన చోదకులు కోరుతున్నారు. చినుకు పడితే రహదారి చిత్తడి అవుతోంది. ఈ రహదారిపై భారీ వాహనాల రాకపోకలు కొనసాగడంతో ఈ రహదారి మరింత శిథిలమవుతోంది. ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులు మంజూరు చేసి వెంటనే రహదారి పనులు ప్రారంభించాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.


