
అందని వైద్యం... ఆవేదనలో జనం
బొబ్బిలిరూరల్: వైద్యుల సమ్మెతో గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు వైద్య సేవలు అందడం లేదు. పిరిడి పీహెచ్‌సీలో బాడంగి ఆయుర్వేద వైద్యురాలిని, విజయనగరం జీజీహెచ్‌లో ఎంబీబీఎస్ ఇంటర్న్‌షిప్ చేస్తోన్న మరో విద్యార్థినిని నియమించారు. అయితే, మెరుగైన వైద్యసేవలు అందడంలేదని రోగులు వాపోతున్నారు.
● పక్కి పీహెచ్‌సీలో బొబ్బిలి ప్రభుత్వాస్పత్రికి చెందిన ఆయుష్ వైద్యులను నియమించారు. వైద్యసేవలు అందకపోవడంతో ఆస్పత్రికి వచ్చే రోగుల సంఖ్య అమాంతం పడిపోయింది. గతంలో ప్రతిరోజు 80 ఓపీ నమోదుకాగా, ఇప్పుడు 20 ఓపీ నమోదవుతోంది. అత్యవసర వేళ ఆస్పత్రికి వచ్చేవారిని కూడా విజయనగరం ప్రభుత్వాస్పత్రికి రిఫర్ చేస్తున్నారంటూ రోగుల బంధువులు వాపోతున్నారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో 87 పీహెచ్‌సీలు ఉన్నాయి. వాస్తవంగా పీహెచ్‌సీకి ఇద్దరు వైద్యులు ఉండాలి. విజయనగరంలో 50 పీహెచ్‌సీలకు 100 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా 94 మంది ఉన్నా రు. వీరిలో 71 మంది వైద్యులు సమ్మెలో ఉన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలో 37 పీహెచ్‌సీలు ఉండగా వీటిలో సుమా రు 67 మంది వైద్యులు పని చేస్తున్నారు. పీజీ సీట్లలో రిజర్వేషన్, వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ గత నెల 26 నుంచి వైద్యులు వివిధ రూపాల్లో నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం దిగిరాకపోవడంతో గత నెలాఖరు నుంచి ఓపీ, అత్యవసర సేవలను సైతం నిలిపివేసి.. సమ్మెలోకి వెళ్లిపోయారు. పీహెచ్‌సీల్లో సేవలు నిలిచిపోకుండా వైద్యశాఖాధికారులు విజయనగరం, పార్వతీ పురం జిల్లా ఆసుపత్రులు, వైద్య కళాశాల, మిమ్స్, ఆయుష్, ఇతర విభాగాల నుంచి డిప్యుటేషన్‌పై పంపించినా వీరిలో చాలామంది వేర్వేరు స్పెషలి స్టులు కావడంతో మొక్కుబడిగా ఇలా వచ్చి, అలా చూసి వెళ్లిపోతున్నారు. ఫలితంగా రోగులకు సరైన చికిత్స అందడం లేదు.
సమ్మె కారణంగా రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏపీవీపీ ఆస్పత్రుల నుంచి 20 మంది వైద్యులను, ప్రభుత్వ వైద్య కళాశాల నుంచి 15 మంది వైద్యులను నియమించాం. వారు ఆస్పత్రు లకు వెళ్లడం లేదని తెలిస్తే చర్యలు తీసుకుంటాం. ప్రతీ పీహెచ్‌సీ పరిధిలో ఉన్న ఆయుష్ వైద్యులు సైతం సేవలందిస్తున్నారు.
– డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఎంహెచ్‌ఓ

అందని వైద్యం... ఆవేదనలో జనం

అందని వైద్యం... ఆవేదనలో జనం