
కానిస్టేబుల్స్‌కు ఉత్తమ శిక్షణ అందించాలి
విజయనగరం క్రైమ్: కానిస్టేబుల్స్‌కు ఉత్తమ శిక్షణ ఇవ్వాలని ఎస్పీ దామోదర్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన నగర శివారు సారిపల్లి జిల్లా పోలీస్ శిక్షణ కళాశాలను తనిఖీ చేశారు. ట్రెనీ కానిస్టేబుల్స్ శిక్షణకు రానున్న నేపథ్యంలో వసతులను ఎస్పీ పరిశీలించారు. శిక్షణార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని మౌలిక వసతులు కల్పించాలని ఈ సందర్భంగా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ స్పష్టం చేశారు. జిల్లా పోలీసు శిక్షణ కేంద్రంలోని తరగతి గదులను, కార్యాలయం, వంట గది, డైనింగ్ హాల్, స్టోర్ రూమ్, వాష్ రూమ్, స్నానపు గదులు, మినరల్ వాటర్ ప్లాంట్, లైబ్రరీ, పరేడ్ గ్రౌండ్, కంప్యూటర్ ల్యాబ్, ఫైరింగ్ రేంజ్‌ను ఎస్పీ స్వయంగా పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. ఎస్పీ వెంట అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, డీపీటీసీ డీఎస్పీ ఎం.వీరకుమార్, సీఐలు బి.లలిత, చంద్రశేఖర్, శ్రీనివాసరెడ్డి, జి.గోపాల నాయుడు, ఎస్సైలు రామ్ గణేష్, మురళి, డీపీటీసీ సిబ్బంది పాల్గొన్నారు.
సారిపల్లి డీటీపీసీని సందర్శించిన ఎస్పీ