
గురువారం శ్రీ 23 శ్రీ అక్టోబర్ శ్రీ 2025
పడకేసిన పల్లైవెద్యం!
మూడు వారాలుగా సమ్మెలో పీహెచ్‌సీ వైద్యులు రోగులకు తప్పని తిప్పలు నిలిచిన 104 సేవలు! ఆందోళనలో దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు
న్యూస్‌రీల్
విజయనగరం ఫోర్ట్:
ఓ వైపు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల(పీహెచ్‌సీ) వైద్యుల సమ్మె... మరోవైపు ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) ప్రైవేటు నెట్‌వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు సేవల నిలిపివేతతో రోగులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందక అవస్థలు పడుతున్నారు. కొందరు ప్రాణాలు విడుస్తున్నారు. పీహెచ్‌సీ వైద్యుల సమ్మెతో పల్లె ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం కోసం గంటల తరబడి నిరీక్షిస్తున్నా ఫలితం ఉండడంలేదు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఆవేదన చెందుతున్నారు. ప్రతినెలా అందే 104 వాహన సేవలు కొన్నిచోట్ల నిలిచిపోవడం, మందులు అందకపోవడంతో అస్వస్థతకు గురవుతున్నారు. పీహెచ్‌సీల్లో ఇన్‌చార్జి వైద్యులను నియమించినా సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయంటూ రోగు లు, వారిబంధువులు ఆరోపిస్తున్నారు. కొన్నిచోట్ల ఫార్మసిస్టులు, నర్సులు వైద్యం చేస్తున్నారు.
పీహెచ్‌సీ వైద్యుల సమ్మెతో ఫ్యామిలీ డాక్టర్ సేవలు నిలిచిపోయాయి. ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రతిరోజు ఒక గ్రామంలో నిర్వహించాలి. ఉదయం వైద్యశిబిరం ఏర్పాటు చేసి అక్కడకు వచ్చే రోగుల కు వైద్య పరీక్షలు చేయడంతో పాటు అవసరమైన మందులు అందజేయాలి. మధ్యాహ్నం పాఠశాల లు, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి అక్కడ పిల్లలకు పరీక్షించాలి. ఆ తర్వాత పక్షవాతం, ఇతర అనారోగ్యం కారాణాలతో మంచాన పడినవారి ఇంటికి వెళ్లి చికిత్స అందించాలి. వైద్యులు సమ్మెతో ఈ సేవలన్నింటిని ఏఎన్‌ఎం, స్టాఫ్ నర్సు, పారా మెడికల్ సిబ్బందితో కానిచ్చేస్తున్నారు. దీనిపై పల్లెప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గురువారం శ్రీ 23 శ్రీ అక్టోబర్ శ్రీ 2025