
నిలకడగా ‘తోటపల్లి’
గరుగుబిల్లి: తోటపల్లి ప్రాజెక్టు వద్ద నాగావళి నీటి ప్రవాహం బుధవారం నాటికి నిలకడగా ఉంది. ప్రాజెక్టులోకి 4,685 క్యూసెక్కుల వరదనీరు చేరుతుండగా 5,576 క్యూసెక్కుల నీటిని తిరిగి నదిలోకి విడిచి పెడుతున్నట్టు అధికారు లు తెలిపారు. వరదనీటి ప్రవాహంపై ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామన్నారు. తుఫాన్ నేపథ్యంలో నదీతీర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తహసీల్దార్ పి.బాల కోరారు. వరి కోతలను తాత్కాలికంగా వాయిదా వేయాలని రైతులకు వ్యవసాయాధికారి జ్యోత్స్న సూచించారు.
పార్వతీపురం రూరల్: ఆర్టీసీ కాంప్లెక్స్‌లో గోడబాంబుల పేలుడు ఘటనలో వాటి తయారీ, రవాణాకు పాల్పడిన నలుగురు నిందితులను కోర్టు ఆదేశాల మేరకు బుధవారం రిమాండ్‌కు తరలించినట్టు పార్వతీపురం పట్టణ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ గోవింద తెలిపారు. వీరిలో మెంటాడ మండలం ఇద్దనవలసకు చెందిన దాసరి పెంటయ్య (తయారీదారు), ముప్పిడి కాశీరా జు, అల్లాడ రవీంద్ర (రవాణాదారు), కొత్త కోట కిశోర్ (కొనుగోలుదారు) ఉన్నారన్నారు.
పార్వతీపురం రూరల్: పరిశ్రమల స్థాపనతోనే నిరుద్యో గ యువతకు ఉపాధి కలుగుతుందని, పరిశ్రమల ఏర్పాటుపై కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి గ్రామంలో 5 నుంచి 10 యూనిట్లు (పరిశ్రమలు) నెలకొల్పేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రభు త్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రత్యేక ‘డ్రైవ్’ నిర్వహించాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో జిల్లా పరిశ్రమల కేంద్రం బుధవారం నిర్వహించిన వ్యవస్థాపకత (ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్) వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం తీసుకువచ్చిన ఐడీపీని (ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ) మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. పరిశ్రమల స్థాపనతో ఉపాధి అవకాశాలు పెరిగి, యువత నైపుణ్యాలు మెరుగుపడతాయని తెలిపారు. ప్రతి శాఖకు నోడల్ అధికారిని నియమించడం జరుగుతుందని, మహిళా సంఘాలు, యువతకు అవగాహన కల్పించాలన్నారు. ‘పీఎంఈజీపీ’ (ప్రధాన మంత్రి ఉపాధి కల్పన పథకం) ద్వారా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉద్యోగాలు సృష్టించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్వయం ఉపాధి కోసం మైక్రో–ఎంటర్‌ప్రైజెస్‌లకు ఈ పథకం ఆర్థిక సహాయం అందిస్తుందని వివరించారు. మండల స్థాయి సమావేశాలకు బ్యాంకర్లు తప్పనిసరిగా హాజరయ్యేలా చూడాలని ఎల్‌డీఎంను ఆదేశించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ ఎం.వి.కరుణాకర్ మాట్లాడుతూ 18 ఏళ్లు దాటిన విద్యార్హత గలవారు, స్వయం సహాయక సంఘాలవారు కూడా ఈ పథకాలకు అర్హులని తెలిపారు. పరిశ్రమల అనుమతి, దరఖాస్తు వివరాలను వివరించారు. లబ్ధిదారులు తప్పనిసరిగా మూడేళ్లు యూనిట్‌ను నిర్వహించాలని, ఆ తర్వాతే రాయితీ సొమ్ము వ్యక్తిగత ఖాతాకు జమ అవుతుందని స్పష్టం చేశారు. కొత్త పరిశ్రమలను ‘ఉద్యమ్’లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కౌశల్–2025 జిల్లా
కో ఆర్డినేటర్‌గా బంగారయ్య
నెల్లిమర్ల: సైన్స్ ప్రతిభ పరీక్ష కౌశల్–2025 జిల్లా కోఆర్డినేటర్‌గా శివుకు బంగారయ్య నియ మితులయ్యారు. ఆయన జరజాపుపేట ఉన్నత పాఠశాలలో సైన్స్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నారు. నవంబర్ 1 నుంచి 4వ తేదీ వరకు పాఠశాల స్థాయి పోటీలు, 27, 28 తేదీల్లో జిల్లాస్థాయి పోటీలు జరుగుతాయని బంగారయ్య తెలిపారు.