
తైక్వాండో పోటీల విజేతలకు డీఈఓ అభినందన
విజయనగరం: రాష్ట్రస్థాయిలో జరిగిన స్కూల్ గేమ్స్ తైక్వాండో పోటీల్లో విజేతలుగా నిలిచిన జిల్లా క్రీడాకారుల బృందానికి జిల్లా విద్యాశాఖ అధికారి యు.మాణిక్యంనాయుడు అభినందనలు తెలిపారు. గుంటూరు జిల్లా బాపట్ల రేపల్లెలో జరిగిన అండర్–14 బాల, బాలికల తైక్వాండో పోటీలలో జిల్లా క్రీడాకారులు ఒక బంగారు, నాలుగు రజత పతకాలు, నాలుగు కాంస్య పతకాలను సాధించారు. రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులను అభినందించడంతో పాటు భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శులు కె.గోపాల్, విజయలక్ష్మి పాల్గొన్నారు.