
‘ఆశ్రమ’ విద్యార్థుల ఆరోగ్యపై ప్రత్యేక దృష్టి సారించాలి
మక్కువ: ఆశ్రమ పాఠశాలల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని మండల నోడల్ అధికారి కేసీఆర్.రెడ్డి అన్నారు. ఈ మేరకు స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఆశ్రమ పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు ఉంటే తక్షణమే వైద్య సిబ్బందికి సమాచారం అందించాలని చెప్పారు. పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తాగునీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లోరినేషన్ చేపట్టాలని సూచించారు. పిల్లల హాజరు, పారిశుధ్యం, భోజనం సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. పాఠశాలలో సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీఓ ఎన్. సూర్యనారాయణ, మండల విద్యాశాఖ అధికారి శ్యాంసుందర్, ఆశ్రమ పాఠశాలల హెచ్ ఎంలు పాల్గొన్నారు.