
రైలుపట్టాల పక్కన గుర్తు తెలియని మృతదేహం
బాడంగి: మండలంలోని డొంకినవలస రైల్వేస్టేషన్ పిండ్రంగివలస మధ్య ఎల్‌సీగేట్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వేపోలీసులు సోమవారం కనుగొన్నారు. దీనికి సంబంధించి రైల్వే పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సుమారు 50–55 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తిని రైలు ఢీకొట్టిందో లేదా రైలు నుంచి జారిపోయి తగిలిన గాయాలతో అక్కడికక్కడే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడి శరీరంపై తెల్లని టీషర్ట్, దానిపై సర్దార్‌వల్లభ్ భాయ్ ఫొటో, ఏక్తాదివస్, కొండా పండా బీజేపీ ఆని ఒరియాభాషలో రాసి ఉన్న కాషాయ రంగు టవల్, పసుపు ఎరుపు రంగుదుప్పటి, గులాబీరంగులుంగీ, చేతిసంచీ అందులో చిల్లరపైసలు, బియ్యం ఉన్నాయన్నారు. ఆచూకీతెలిసిన వారు విజయనగరం జీఆర్‌పీఎస్ ఎస్సై బాలాజీరావు ఫోన్ 9490617089కు గానీ, బొబ్బిలి హెసీ ఫోన్ 9491813163నంబర్‌కు కానీ సమాచారం తెలియజేయాలని కోరారు. మృతదేహాన్ని విజయనగరం ఆస్పత్రికి తరలించి బొబ్బిలి హెచ్‌సీ ఈశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
గుర్ల: మండలంలోని కొండగండ్రేడు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రేజేటి పాపినాయుడు (38) చికిత్స పొందు తూ సోమవారం మృతి చెందాడు. కోండగండ్రేడుకు చెందిన పాపినాయుడు శనివారం దిచక్రవాహనంపై అచ్యుతాపురం వస్తుండగా కొండగండ్రేడు దాటిన తర్వాత ద్విచక్ర వాహ నం అదుపు తప్పి రోడ్డు ప్ర మాదం జరిగింది. ఈ విష యం తెలుసుకున్న కుటుంబసభ్యులు విజయనగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గుర్ల ఎస్సై నారాయణ రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో
వ్యక్తికి తీవ్ర గాయాలు
వీరఘట్టం: మండలంలోని సీఎస్‌పీ రోడ్డు బొడ్లపాడు జంక్షన్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చెవ్వాకుల కృష్ణ అనే చిరు వ్యాపారి తలకు తీవ్రగాయాలైనట్లు ఎస్సై జి.కళాధర్ తెలిపారు. బొడ్లపాడు గ్రామానికి వెళ్లి తన మోపెడ్‌పై సీఎస్‌పీ రోడ్డుకు వస్తుండగా, బొబ్బిలి నుంచి కోటబొమ్మాళి బైక్‌పై వెళ్తున్న పక్కి అనిల్‌కుమార్ అనే వ్యక్తి ఈ జంక్షన్‌న్‌లో కృష్ణ మోపెడ్‌ను ఢీ కొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో కృష్ణ తలకు తీవ్రగాయమై రక్తస్రావం కావడంతో పాలకొండ ఏరియా ఆస్పత్రికి, అక్కడి నుంచి శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించినట్లు చెప్పారు. అనిల్‌కుమార్‌కు కూడా గాయాలైనట్లు తెలిపారు.
బొండపల్లి: OÆð‡Ë$ C…h¯ŒS-ÌZ Ýë…MóS-†MýS ÌZç³… ™èlÌñæ-™èl¢-yýl…-™ø MöÆ>ç³#sŒæ ¯]l$…_ ÑÔ>-Qç³-r²… Ððlâ¶æ$¢¯]l² ´ëíÜ…fÆŠ‡ OÆð‡Ë$ VýSÆý‡$-yýl$-¼ÍÏ OÆð‡ÌôæÓ-õÜt-çÙ¯ŒS-ÌZ Ð]l$…VýS-âýæ-ÐéÆý‡… ÝëĶæ$…-{™èl… Æð‡…yýl$-¯]l²Æý‡ VýS…rË$ ´ër$ °Í_´ù-Ƈ$$…¨. ÑÔ>-Qç³-r²… Ððlâ¶æ$¢…yýl-V> OÆð‡Ë$ õÜtçÙ¯ŒS-ÌZ BW †ÇW ºÄ¶æ$-Ë$ §ólÆý‡-yé-°MìS ÝëĶæ$…-{™èl… ¯éË$VýS$-¯]l²Æý‡ VýS…rÌSMýS$ {OyðlÐ]lÆŠ‡ {ç³Ä¶æ$-†²…^èl-V> C…h¯ŒS-ÌZ Ýë…MóS †MýS çÜÐ]l$çÜÅ Æ>Ð]l-yýl…-™ø çÜ$Ð]l*Æý‡$ Æð‡…yýl$-¯]l²Æý‡ VýS…rÌS ´ër$ õÜtçÙ¯ŒS-ÌZ¯ól OÆð‡Ë$ °Í_´ù-ÐéÍÞ Ð]l_a…¨. ©…™ø OÆð‡ÌôæÓ A«¨M>Æý‡$-Ë$ ÑÔ>-Qç³-r²… ¯]l$…_ ÐólÆó‡ C…h¯ŒS¯]l$ ™ðlí³µ…_ OÆð‡Ë$¯]l$ Ð]l¬…§ýl$MýS$ MýS¨Í…^éÆý‡$. Æð‡…yýl$-¯]l²Æý‡ VýS…rÌS ´ër$ {ç³Ä¶æ*-×ìæ-MýS$-Ë$ õÜtçÙ¯ŒS-ÌZ¯ól ç³yìl-V>ç³#-Ë$ M>Ķæ*-ÍÞ¯]l ç³Çíܪ† ¯ðlÌS-Mö…¨. _¯]l² í³ÌS-ÏË$ Ð]l–§ýl$®-Ë$ õÜtçÙ¯ŒS-ÌZ ¯é¯é AÐ]l-çܦ-Ë$ ç³yézÆý‡$.˘
బొబ్బిలి: మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో స్థానిక గొల్లపల్లి ఆటో స్టాండ్ వద్ద ఓ మహిళ రోడ్డుపై పడిపోగా తలకు దెబ్బతగిలి రక్తం ధారగా కారుతోంది. నోట్లోంచి కూడా రక్తం వస్తోంది. అంతలో అటుగా వెళ్తున్న ఎస్సై ఆర్.రమేష్ కుమార్ ఆ మహిళ స్థితి చూసి పరిశీలించి వెంటనే 108కి సమాచారమందించారు. కానీ సమయానికి 108 రాలేదు. దీంతో తానే ఓ ఆటో మాట్లాడి స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యసిబ్బంది అప్పటికే మృతి చెందిందని చెప్పగా అయ్యో అంటూ నిరుత్సాహం చెందారు. చివరకు ఆమె గురించి ఆరా తీయగా యాదవ వీధికి చెందిన బొట్ట ఆదెమ్మ(70)అని తేలింది. గొల్లపల్లిలోని యూహెచ్‌సీకి ఆరోగ్య చికిత్స కోసం వచ్చిందని, అట్నుంచి వస్తుండగా బీపీ పెరిగి పడిపోయి ఉండొచ్చని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తీసుకువెళ్లారు.

రైలుపట్టాల పక్కన గుర్తు తెలియని మృతదేహం