
బాలల హక్కుల కోసం సంక్షేమ కమిటీలు
● కలెక్టర్ రామ్‌సుందర్ రెడ్డి
విజయనగరం ఫోర్ట్: బాలల హక్కుల కోసం పరిరక్షణ కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ ఎస్.రామ్‌సుందర్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రో చైల్డ్ గ్రూప్ జిల్లా చైల్డ్ రైట్స్ ఫోరం రుపొందించినవాల్ పోస్టర్‌ను మంగళవారం ఆయన తన చాంబర్‌లో ఆవిష్కరించారు. ఐసీడీఎస్ పీడీ టి.విమలారాణి మాట్లాడుతూ బాలల సంక్షేమం కోసం మిషన్ వాత్సల్య ద్వారా అమలు జరుగుతున్న పథకాల అమలును పర్యవేక్షించడం, పిల్లల సంరక్షణ, పునరావాసం, శిశు హక్కులను పరిరక్షించడంలో బాలల పరిక్షణ కమిటీలు పనిచేస్తాయన్నారు. బాల్య వివాహాల నివారణకు నిర్దిష్టమైన కార్యక్రమాలను చేపట్టి బాలల హక్కుల పరిరక్షణకు కమిటీలు కృషి చేస్తాయని తెలిపారు. కార్యక్రమంలో చైల్డ్‌రైట్స్ ఫోరం కన్వీనర్ పి.చిట్టిబాబు, పోగ్రాం ఆఫీసర్ నాగరాజు, కౌన్సిలర్ సంధ్య, లీగల్ కో ఆర్డినేటర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.