
చెరువును కాపాడుకుందాం
పార్వతీపురం రూరల్: మండలంలోని బాలగుడబ గ్రామంలో ఉన్న తూర్పుకోనేరు చెరువులో వ్యర్థాలను గ్రామ యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి బయటకు తీసి చెరువును శుద్ధి చేశారు. స్థానిక సర్పంచ్ ప్రతినిధి, వైఎస్సార్‌సీపీ నాయకుడు బి.పండు ఆధ్వర్యంలో జరిగిన ఈ పర్యావరణ పరిశుభ్రత కార్యక్రమంలో స్థానిక యువత పాల్గొని శ్రమదానం చేశారు. ఈ సందర్భంగా పండు మాట్లాడుతూ అప్పట్లో గ్రామంలోని గ్రామస్తులంతా తూర్పుకోనేటిలో నీటినే తాగేవారని బాద్యతగా ప్రతి ఒక్కరూ గ్రామానికి నీటి వనరైన చెరువులను కాపాడుకోవాలని ఈ మేరకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా వ్యవహరిస్తూ వ్యర్థాలు వంటివి చెరువులో వేయకుండా ఉండాలని పిలుపునిచ్చారు.
ఘనంగా దీపావళి సంబరాలు
బలిజిపేట: మండలంలోని గ్రామాల్లో దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నివాసగృహాల్లో మహిళలు లక్ష్మీదేవి పూజలు చేసి ధూపదీప నైవేద్యాలు సమరించారు. సాయంత్రం సమయంలో ఇంటింటా దీపాలు వెలిగించి మందుగుండు సామగ్రిని కాల్చి సంబరాలు జరుపుకున్నారు. చిన్నారులు కాకరపువ్తొత్తులు, మతాబాలు, తెల్లని కాంతులు విరజిమ్మే చిచ్చుబుడ్లు వెలిగించారు.

చెరువును కాపాడుకుందాం