
మలేరియా మాత్రలు మింగి మహిళ ఆత్మహత్య
కురుపాం: మండలంలోని ఏగులవాడ పంచాయతీ ఈతమానుగూడ గిరిజన గ్రామానికి చెందిన మండంగి సూరమ్మి (30) మలేరియా మాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై కురుపాం ఎస్సై నారాయణరావు అందించిన వివరాల్లోకి వెళ్తే.. గురువారం రాత్రి భర్త మండంగి సురేష్‌ను భార్య సూరమ్మి మద్యం తాగవద్దని మందంలించగా ఇద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరగడంతో మనస్తాపం చెందిన సూరమ్మి ఇంట్లో ఉన్న 8 మలేరియా మాత్రలను మింగి అపస్మారక స్థితిలోకి జారుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు శుక్రవారం ఉదయం మొండెంఖల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.