● ప్రాణాలతో చెలగాటం
ఈ చిత్రం చూశారా.. అనారోగ్యంతో వైద్యం కోసం సంచి వైద్యుడి దగ్గరకు వస్తే... కుర్చీలో కూర్చోబెట్టి సిలైన్ పెట్టేశాడు. ఒకరికి కాదు.. ముగ్గురు రోగులకు ఇదే తరహాలో సిలైన్‌లు పెట్టడాన్ని చూసిన వారు ఆశ్చర్యపోయారు. సీతంపేటలో ప్రతి సోమవారం వారపు సంత జరుగుతుంది. వారపుసంతకు వచ్చే సమయంలో అనారోగ్యంగా ఉన్నా, జ్వరం వచ్చినా ఏరియా ఆస్పత్రికి వెళ్లకుండా సంతోలో ఉండే సంచి వైద్యులను, క్లినిక్‌లను ఆశ్రయిస్తారు. ఈ క్రమంలో సంతకు సమీపంలో కొత్తూరు మండలానికి చెందిన ఓ ప్రైవేటు సంచి వైద్యుడు ఇదిగో ఇలా ఆరుబయటే మందులు పెట్టేసి నాలుగు కుర్చీలు వేసి వైద్యసేవలు అందించాడు. ప్రతివారం ఇదే తరహాలో వైద్యసేవలు అందజేస్తారని రోగులు చెబుతున్నారు.
– సీతంపేట


