
రూ.4 వేల పారితోషికం.. నెలల తరబడి పెండింగ్..!
బకాయి వేతనాలు చెల్లించండి
పార్వతీపురంటౌన్: వారంతా ఎండ, వానను లెక్కచేయకుండా మారుమూల గిరిశిఖర, గిరిజన ప్రాంతంలో ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ వైద్యకార్యక్రమాలు క్షేత్రస్థాయిలో విజయవంతం చేయడంలో కీలకభూమిక పోషిస్తున్నారు. వీరి సేవలకు ప్రభుత్వం కేవలం నెలకు రూ.4వేలు పారితోషికం అందజేస్తోంది. అదికూడా నెలల తరబడి అందజేయకపోవడంతో వారంతా ఆవేదన చెందుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలుపుతున్నారు.
సేవలు ఇలా..
పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 1190 మంది, సీతంపేట ఐటీడీఏ పరిధిలో 375 మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. వారంతా ఆశ వర్కర్లతో సమానంగా పనిచేస్తున్నా వేతనాలు పెంచలేదు. కనీసం ఆశవర్కర్లుగా మార్పుచేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా పట్టించుకోవడంలేదు.
● సీహెచ్ డబ్ల్యూలను ఆశ వర్కర్లుగా మార్పు చేయాలి.
● పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో నాలుగు నెలల పారితోషికం బకాయిలను వెంటనే చెల్లించాలి.
● యూనిఫాం, గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
● సీహెచ్‌డబ్ల్యూలకు అధికార్లతో జూయింట్ మీంటింగ్ గ్రీవెన్స్ ఏర్పాటు చేయాలి.
● ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలి.
● 2018 సంవత్సరం కాలంలో 970 మందికి అందజేయాల్సిన 21 నెలలు పారితోషికాన్ని తక్షణమే చెల్లించాలి.
అన్నవరం పీహెచ్‌సీ పరిధిలో గత పదేళ్లుగా కమ్యూ నిటీ హెల్త్ వర్కర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గిరిశిఖర గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్నాం. ఆశ వర్కర్లతో సమానంగా విధులు నిర్వహిస్తున్నా పారితో
షికం పెంచడంలేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం.
– ఆరిక భూలక్ష్మి, సీహెచ్‌డబ్ల్యూ, అన్నవరం
ప్రభుత్వ పాలకులు స్పందించాలి. రూ.4వేలుతో ఎలా బతకగలమో గుర్తించాలి. పెరిగిన ధరలు, కుటుంబాల అవసరాలకు పారితోషికం సరిపోవడం లేదు. ఆశ వర్కర్లుగా గుర్తించి వేతనం పెంచాలి. – తోయక భాగ్యలక్ష్మి,
సీహెచ్‌డబ్ల్యూ, వాడబాయి
సీహెచ్‌డబ్ల్యూఓలకు పారితోషికం బకాయిలను తక్షణమే చెల్లించాలి. ఆశ వర్కర్లుగా మార్పుచేయాలి. ప్రజాసంక్షేమ పథకాలు అందజేయాలి. లేదంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తాం.
– గొర్లి వెంకటరమణ, సీఐటీయూ జిల్లా కోశాధికారి, పార్వతీపురం
ఆర్థిక ఇబ్బందుల్లో కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు
ఆశవర్కర్లుగా గుర్తించాలని డిమాండ్
జిల్లా వ్యాప్తంగా 1565 మంది కమ్యూనిటీ హెల్త్ వర్కర్లు

రూ.4 వేల పారితోషికం.. నెలల తరబడి పెండింగ్..!

రూ.4 వేల పారితోషికం.. నెలల తరబడి పెండింగ్..!

రూ.4 వేల పారితోషికం.. నెలల తరబడి పెండింగ్..!