
వామ్మో.. విషసర్పాలు!
ప్రథమ చికిత్స ఇలా...
● మన్యం ప్రజలకు పాముల భయం
● కొద్దినెలల్లో 85 మందికి పాముకాటు
పార్వతీపురం రూరల్: ఖరీఫ్ సీజన్‌లో వ్యవసాయ పనుల్లో నిమగ్నమైన రైతులను పాముల భయం వెంటాడుతోంది. కలుపుతీత పనులు, ఎరువులు జల్లేందుకు ఏమరుపాటుగా వెళ్లిన రైతులు పాము కాటుకుగురవుతున్నారు. పాములకు చెవులు లేనప్పటికీ వాటి శరీరం కింద భాగంలో ఉండే ప్రత్యేక పొలుసు ద్వారా శబ్ధ ప్రకంపనలను గ్రహిస్తాయి. వేడి రక్తం ప్రవహించే జంతువులు, మనుషులు సమీపంలోకి వచ్చినప్పుడు అవి వెంటనే వాటిని గుర్తించి కాటు వేస్తాయి. పాములు ఏకాంతానికి భంగం కలిగినప్పుడు, ప్రాణభయం ఉన్నప్పుడు, ఎవరైనా అకస్మాత్తుగా తొక్కినప్పుడు మాత్రమే అవి కాటు వేస్తాయని వైద్యులు చెబుతున్నారు.
జాగ్రత్తలు తప్పనిసరి..
గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి వేళల్లో తిరిగే వారితో పాటు పొలాల దగ్గర నిద్రించే రైతులు, కూలీలు జాగ్రత్తలు పాటించాలి. పాములు కిరోసిన్, పెట్రోలు, డీజిల్ వాసన భరించలేవు. ఎక్కువగా ఉన్నచోట వీటిని ఉపయోగించడం మంచిది. రైతులు, కూలీలు రాత్రి వేళల్లో తిరిగే సమయంలో మోకాళ్ల వరకు రబ్బరు బూట్లు వేసుకోవడం ఉత్తమం.
పాము కాటుకు గురైన వ్యక్తి భయపడాల్సిన అవసరం లేదు. ఆలస్యం చేయకుండా దగ్గరలోని ఆస్పత్రికి వస్తే యాంటీ స్నేక్‌వీనం మందు ఎక్కిస్తాం. అన్ని ప్రభుత్వాస్పత్రుల్లోనూ యాంటీ స్నేక్ వీనం వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. కాటువేసిన పామును గుర్తిస్తే చికిత్స సులభమవుతుంది. పాము విషపూరితమా?కాదా? అన్నది నిర్ధారణ చేయొచ్చు.
– డాక్టర్ పి.రవికుమార్,
సివిల్ సర్జిన్, జిల్లా కేంద్రాస్పత్రి
పాము కాటు వేసిన పై భాగంలో వెంటనే రక్త ప్రసరణ జరగకుండా తాడుతో గట్టిగా కట్టాలి. కాటు వేసిన శరీర భాగంలో బ్లేడుతో గాయంచేసి రక్తం కారనివ్వాలి.
పాము కాటుకు గురైన వ్యక్తి ఆందోళన చెందకుండా ఉండాలి. పక్కన వ్యక్తి ఉంటే బాధితుడికి ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించాలి.
కాటువేసిన పాము అంతకు ముందు ఆహారం తీసుకున్నా.. మరో జీవికి కాటు వేసినా విషం తీవ్రత తక్కువగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.
పాము కాటువేసిన వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లోను ఆహారం ఇవ్వకూడదు. నడిపించడంతో పాటు పరుగెత్తించకూడదు.
నాటు మందు, మాత్రలు అని కాలయాపన చేయకుండా వెంటనే దగ్గర్లోని వైద్యశాలకు తరలించాలి.
పాము కాటుకు గురైన వ్యక్తిని నిద్ర పోకుండా చూసుకుని, కదలించకుండా ఆస్పత్రిలో చేర్చాలి.

వామ్మో.. విషసర్పాలు!

వామ్మో.. విషసర్పాలు!

వామ్మో.. విషసర్పాలు!