
కలెక్టర్‌గా ప్రభాకర్ రెడ్డి
పార్వతీపురం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల కలెక్టర్లను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా ఎన్.ప్రభాకర్ రెడ్డిని నియమించింది. ఆయన ప్రస్తుతం సీసీఎల్‌ఏ జాయింట్ సెక్రటరీగా విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో సహాయ కమిషనర్‌గా, స్పోర్ట్స్ అథారిటీ నిర్వహణ డైరెక్టర్‌గా, నెల్లూరు సంయుక్త కలెక్టర్‌గా పనిచేశారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌గా బదిలీ కావడం సంతోషంగా ఉందని, జిల్లా అభివృద్ధికి తనవంతు కృషిచేస్తానన్నారు. కొద్దిరోజుల్లో బాధ్యతలు స్వీకరిస్తానని తెలిపారు. ఇప్పటివరకు జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఎ.శ్యామ్‌ప్రసాద్ శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.
జేసీగా యశ్వంత్‌కుమార్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
పార్వతీపురం రూరల్: పార్వతీపురం మన్యం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా సి.యశ్వంత్ కుమార్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు డీఆర్‌ఓ కె.హేమలత పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు. వేదపండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం రెవెన్యూ సేవలకు సంబంధించిన ఉద్యోగుల సంఘం అధ్యక్షులు, ప్రతినిధులు, తహసీల్దార్లు, జిల్లా అధికారులు, కలెక్టరేట్‌లో విధులు నిర్వహిస్తున్న పలు విభాగాల అధికారులు, సిబ్బంది జేసీకి పుష్పగుచ్ఛాలు అందజేశారు. రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు సంబంధించిన కరపత్రాలను అధికారుల సమక్షంలో జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. జాయింట్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన యశ్వంత్‌కుమార్ రెడ్డి ఇటీవల పాలకొండ సబ్‌కలెక్టర్‌గా, సీతంపేట ఐటీడీఏ పీఓగా బాధ్యతలు నిర్వహిస్తూ బదిలీ అయ్యారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులతో జేసీగా వచ్చారు.
ఐటీడీఏ పీఓగా పూర్తి అదనపు బాధ్యతలు
యశ్వంత్ కుమార్‌రెడ్డి జేసీగా, పార్వతీపురం ఐటీడీఏ పీఓగా పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పార్వతీపురం సబ్‌కలెక్టర్ ఆర్.వైశాలి శుభాకాంక్షలు తెలియజేస్తూ పుష్పగుచ్ఛం అందజేశారు.
నేడు డయల్ యువర్ డీపీటీఓ
పార్వతీపురంటౌన్: జిల్లా పరిధిలోని ప్రజారవాణా సమస్యలను తెలియజేసేందుకు నేడు డయల్ యువర్ డీపీటీఓ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని జిల్లా ప్రజా రవాణాశాఖాధికారి పి.వెంకటేశ్వరరావు తెలిపారు. సెప్టెంబర్ 12వ తేదీ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ డీపీటీఓ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రజా రవాణాలో తమ సమస్యలు, సలహాలు, సూచనలు చేయాలనుకునే వారు సెల్: 99592 25605 నంబర్‌కు ఫోన్‌చేసి తెలియజేయాలని కోరారు.
కోడూరు మరియమాత యాత్రకు సర్వం సిద్ధం
బాడంగి: కోడూరు మరియమాత యాత్రకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ నెల 13న జరగనున్న దివ్యబలిపూజలు, ప్రార్థనలకు వీలుగా టెంట్లు, వరుస క్రమంలో వెళ్లి మాతను దర్శించుకునేందుకు వీలుగా బారికేడ్లు ఏర్పాటుచేశారు. తలనీలాలు సమర్పించుకునే భక్తుల కోసం ఆర్‌సీఎం పాఠశాల భవనం వద్ద ప్రత్యేక కాంప్లెక్స్‌ను నిర్మించారు. పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
బుచ్చి అప్పారావు జలాశయం నీరు విడుదల
గంట్యాడ: గొర్రిపాటి బుచ్చి అప్పారావు జలాశయం (తాటిపూడి) నీటి మట్టం పెరుగడంతో జలాశయం నుంచి గురువారం రాత్రి నీటిని విడుదల చేశారు. జలాశయం నీటి మట్టం 297 అడుగులు కాగా ప్రస్తుతం 295.500కు చేరింది. జలాశయం నుంచి 100 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదలచేశారు.

కలెక్టర్‌గా ప్రభాకర్ రెడ్డి

కలెక్టర్‌గా ప్రభాకర్ రెడ్డి