
కూటమి తీరుపై గురువుల నిరసన
డిమాండ్లు పరిష్కరించాలంటూ సాలూరు డబ్బివీధి ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుల నిరసన
కూటమి ప్రభుత్వ విద్యావ్యతిరేక విధానాలపై ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో గురువులు గురువారం నిరసన తెలిపారు. వారం రోజుల నిరసన కార్యక్రమంలో భాగంగా తొలిరోజు నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్ విధానం రద్దుచేయాలని, 57 మెమోను అమలుచేయాలని, ఈహెచ్‌ఎస్ పరిమితిని రూ.25 లక్షలకు పెంచాలని, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలంటూ డిమాండ్ చేశారు. మధ్యాహ్నభోజన విరామ సమయంలో పాఠశాలల ముందు ఆందోళన చేశారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుంటే పెద్దస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు.
–పాలకొండ/కురుపాం/సాలూరు

కూటమి తీరుపై గురువుల నిరసన

కూటమి తీరుపై గురువుల నిరసన