
మందుగుండు నిల్వలు సీజ్
కొమరాడ: మండలంలోని శివిని గ్రామ సమీపంలో దీపావళి మందుగుండు సామాగ్రి అక్రమ నిల్వలు గురువారం పోలీసులు గుర్తించి సీజ్ చేశారు. దీనికి సంబంధించి ఎస్‌ఐ కె.నీలకంఠం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శివిని గ్రామానికి చెందిన సేనాపతి రాజేష్ రానున్న దసరా, దీపావళి పండగలు నేపథ్యంలో అక్రమంగా మందుగుండు సామగ్రి నిల్వలు ఉంచారు. తమిళనాడు రాష్ట్రం శివకాశి నుంచి ఈ సామగ్రి తీసుకుని వచ్చి అనుమతులు లేకుండా భద్రపరిచారు. దీనిపై అందిన విశ్వసనీయ సమాచారం మేరకు సిబ్బందితో కలసి దాడి చేశాం. రూ.2లక్షల విలువ గల మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకుని పోలీస్‌ష్టేషన్‌కు తరలించాం. రాజేష్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ తెలిపారు.