
సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి
పార్వతీపురం రూరల్: నవోదయం 2.0 కింద సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా రెవెన్యూ అధికారిణి కె.హేమలత అన్నారు. సంబంధిత శాఖాపరమైన అధికారుల సమష్టి కృషితోనే ఇది సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం కలెక్టర్ కార్యాలయంలో ఉన్న సమావేశ మందిరంలో ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖాధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాకు సమీపంలో ఒడిశా సరిహద్దు ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో తనిఖీలను మరింత విస్తృతం చేయాలన్నారు. సారా తయారీ, విక్రయాలపై పీడీ యాక్ట్‌లను పటిష్టంగా అమలు చేయాలన్నారు. నవోదయం 2.0తో సారా తయారీ దారుల్లో మార్పు రావాలని, వారి ప్రవర్తనను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారిని గుర్తించి డీఆర్‌డీఏ ద్వారా చేయూతను అందించి వారిలో మార్పు తేవాలన్నారు. సమావేశంలో పాల్గొన్న ఎకై ్సజ్ అధికారులు మాట్లాడుతూ 137 గ్రామాలను జిల్లాలో ఏ, బీ, సీలుగా వర్గీకరించి సదరు గ్రామాలకు దత్తత అధికారులను నియమించి సారా సంబంధిత ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబరు 14405 పై ప్రచారం చేస్తున్నామన్నారు. అవగాహన మేరకు పలు కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు. గత నాలుగు నెలల్లో 22 కేసులు పెట్టి 337మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. 9090 లీటర్ల సారాను, 35,740 లీటర్ల పులియబెట్టిన నల్లబెల్లాన్ని ధ్వంసం చేసినట్టు లిపారు. 38 వాహనాలను కూడా సీజ్ చేశామన్నారు. ఏవోబీ ప్రాంతాల సమీప గ్రామాల్లో చెక్‌పోస్టుల ద్వారా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎకై ్సజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పి.రామచంద్రరావు, సూపరింటెండెంట్ బి.శ్రీనాధుడు, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ ఆర్.కృష్ణవేణి, ఎకై ్సజ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
డీఆర్‌వో కె.హేమలత