వైద్యం.. దయనీయం! | - | Sakshi
Sakshi News home page

వైద్యం.. దయనీయం!

Sep 11 2025 10:14 AM | Updated on Sep 11 2025 3:52 PM

 Tribals transporting a patient in a dolly

డోలీలో రోగిని తరలిస్తున్న గిరిజనులు

మౌలిక సదుపాయాలు కరువు 

రాళ్లదారుల్లో రాకపోకలకు ఇబ్బందులు 

చేరువకాని విద్య, వైద్య సదుపాయాలు 

ఫ్యామిలీ డాక్టర్‌ సేవల నిలిపివేతతో అధికమైన డోలీమోతలు 

అత్యవసర వేళ డోలీలో రోగుల తరలింపు

పల్లె పండగ పేరుతో రోడ్లన్నీ బాగుచేస్తామన్నారు.. గిరిజన ప్రాంతాల్లోని రాళ్లదారులన్నింటినీ అద్దంలా మెరిసిపోయేలా నిర్మిస్తామన్నారు.. రాకపోకలకు కష్టాలు లేకుండా చేస్తామన్నారు.. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర పూర్తవుతున్నా గిరిజన ప్రాంతాల్లో రాళ్లదారులే దర్శనమిస్తున్నాయి. గిరిశిఖర గ్రామాల ప్రజలకు విద్య, వైద్య కష్టాలు షరా మామూలుగా మారాయి. అత్యవసర వేళ రాళ్లదారుల్లో కిలోమీటర్ల మేర డోలీలోనే రోగులను తరలించాల్సిన దుస్థితి. గత ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన ఫ్యామిలీ డాక్టర్‌ సేవలు నిలిచిపోయాక గిరిజన గూడల్లో వైద్య కష్టాలు అధికమయ్యాయి. డోలీమోతలు నిత్యకృత్యంగా మారాయి. దీనికి ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఇటీవల వైద్యం కోసం గిరిజనుల పాట్లే నిలువెత్తు నిదర్శనం.

కొమరాడ: మండలంలోని పూడేస్‌, కుంతేస్‌, మసిమండ, పెదశాఖ, గుణదతీలేస్‌, చోళ్లప దం తదితర పంచాయతీల్లోని పలు గ్రామాలకు రోడ్డు సదుపాయం లేదు. గిరిజనలు ఆనారోగ్యానికి గురైతే డోలీ మోతలే శరణ్యం. నాలుగు రోజుల కింద పా లేం పంచాయతీ పరిధి కుస్తూరు గ్రామానికి చెందిన తాడింగి సురేష్‌ అస్వస్థతకు గురైతే డోలీలో రాళ్లదారిలో 4 కిలోమీటర్ల దూరంలోని పూజారిగూడ వర కు మోసుకొచ్చి అక్కడ నుంచి ఆటోలో కురుపాం పీహెచ్‌సీకి తరలించారు. అనంతరం 108లో కేజీహెచ్‌కు తీసుకెళ్లారు.

పొలం గట్లపై మూడు కిలోమీటర్లు...  

బొబ్బిలిరూరల్‌: మండలంలోని గోపాలరా యుడుపేట పంచాయతీ పరిధిలోని మోసేవల స గ్రామానికి చెందిన చోడిపల్లి ఆశమ్మ క్యాన్స ర్‌ వ్యాధితో బాధపడుతోంది. ఇటీవల విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందిన ఆమె గ్రామానికి చేరుకుంది. మలివిడత చికిత్స కోసం బుధవా రం డోలీలో పొలంగట్లపై నుంచి మూడు కిలోమీటర్లమేర మోసుకుంటూ ఆమె బంధువులు నారశింహునిపేట వద్దకు చేర్చారు. అక్కడి నుంచి వాహనంలో విశాఖపట్నం తీసుకెళ్లారు. ఏ ఆరోగ్య సమస్య వచ్చినా యాతన తప్పడం లేదంటూ గ్రామస్తులు వాపోయారు. కనీసం రోడ్డు సదుపాయం కల్పించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement