
నిరసన తెలుపుతున్న ఏపీటీఎఫ్ నాయకులు (ఫైల్)
నేటి నుంచి ఏపీటీఎఫ్ నిరసన వారం
వీరఘట్టం: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ విద్యావ్యతిరేక విధానాలపై ఉపాధ్యాయలోకం తిరుగుబాటుకు సిద్ధమైంది. అడ్డదిడ్డంగా ఉన్న క్లస్టర్ విధానం, అశాసీ్త్రయ విద్యానిర్ణయాలు, బోధనేతర పనులు, అసెస్‌మెంట్ విధానంలో మూల్యాంకనం, తదితర సమస్యల నుంచి విముక్తికి పోరాటమే సరైన మార్గమని ఏపీటీఎఫ్ (ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్) భావించింది. ఈ నెల 11 నుంచి నిరసన వారం కార్యక్రమంతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగించేందుకు ఉద్యమకార్యాచారణ ప్రణాళికను అమలుచేయనుంది.
ఇదీ కార్యాచరణ
ఈ నెల 11న నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరుకావడం, 12న మండల కేంద్రాల్లో నిరసన, 13, 14 తేదీల్లో ప్రజా ప్రతినిధులకు వినతి పత్రాలు ఇవ్వడం, 15న డివిజన్ కేంద్రాల్లో నిరసన, 16న జిల్లా కేంద్రాల్లో నిరసన, 17న సీఎం, సీఎస్‌లకు వాట్సాప్, ఈమెయిల్‌లో వినతులు అందజేయనున్నారు.
డిమాండ్లు ఇవీ..
ఉపాధ్యాయులకు పెండింగ్‌లో ఉన్న 4 డీఏలను వెంటనే విడుదల చేయాలి.
సీపీఎస్ రద్దు చేయాలి. మెమో నెం.57ను తక్షణమే అమలు చేయాలి.
12వ పీఆర్సీ కమిషన్‌ను నియమించి, ఐఆర్ ప్రకటించాలి.
అన్ని రకాల బకాయిలు చెల్లించాలి. ఈహెచ్‌ఎస్ బకాయిలు రూ.25 లక్షలకు పెంచాలి. యాప్‌లను, అసెస్మెంట్ బుక్‌లెట్ విధానాలను రద్దు చేసి ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలి.
విజయవంతం చేయండి
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 11 నుంచి 17 వరకు చేపట్టనున్న నిరసన వారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఉపాధ్యాయులను చైతన్యవంతం చేయడం, భవిష్యత్‌లో జరగబోయే పోరాటాలకు సన్నద్ధం చేసేందుకు ఏపీటీఎఫ్ ఈ నిరసన వారం కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేపట్టనుంది. – మర్రాపు మహేష్, ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు, పార్వతీపురం మన్యం

కూటమి విద్యావ్యతిరేక విధానాలపై...