
జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయండి
విజయనగరం లీగల్: జిల్లాలో ఈ నెల 13న నిర్వహించనున్న జాతీయలోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు రాజీఅయ్యేలా చూడాలని విజయనగరం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ ఎం.బబిత అన్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఉన్న న్యాయమూర్తులతో బుధవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. రాజీ పడదగిన క్రిమినల్, మోటారు ప్రమాద బీమా, బ్యాంకు, చెక్కుబౌన్స్, ప్రామిసరీ నోట్ కేసులు, పర్మినెంట్ ఇంజక్షన్ దావాలు, ఎగ్జిక్యూషన్ పిటిషన్, ఎలక్ట్రిసిటీ, ఎకై ్సజ్, భూ సంబంధిత కేసులు, కుటుంబ తగాదాలు, మున్సిపాలిటీ, ప్రి లిటిగేషన్ కేసులను ఇరువర్గాల అనుమతితో రాజీమార్గంలో శాశ్వత పరిష్కారం చూపాలన్నారు. ఈ కాన్ఫరెన్స్‌లో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.మీనాదేవి, ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎం.పద్మావతి, పోక్సో కోర్టు జడ్జి కె.నాగమణి, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ జి.దుర్గయ్య, ఎ.కృష్ణప్రసాద్, సీనియర్ సివిల్ జడ్జి, కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో ఉన్న న్యాయమూర్తులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో కాల్ సెంటర్
పార్వతీపురం రూరల్: జిల్లాలో యూరియా, ఎరువుల సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కాల్ సెంటర్‌ను ఏర్పాటుచేసినట్టు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ బుధవారం తెలిపారు. ఎరువులు, యూరియాకు చెందిన ఏవైనా సూచనలు, మార్గదర్శకాలు, సమాచారం కోసం కార్యాలయ పనివేళల్లో (సెలవు రోజు మినహా ) ఫోన్: 089633 59853 నంబర్‌కు ఫోన్‌చేసి తెలుసుకోవచ్చన్నారు.
ఎనీమియా నివారణపై ప్రత్యేక శ్రద్ధ
పార్వతీపురం రూరల్: జిల్లాలో ఎనీమియా ఎక్కువగా ఉందని, దీని నివారణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఐసీడీఎస్ సిబ్బందికి సూచించారు. ఐసీడీఎస్ లక్ష్యాలపై బుధవారం సమీక్షించారు. ఐసీడీఎస్ నుంచి రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు, చిన్నారులకు పౌష్టికాహారం సక్రమంగా అందజేయాలన్నారు. గర్భిణులు 21 రకాలు కలిగిన అదనపు పౌష్టికాహార కిట్లను సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. రక్తహీనత నివారణ చర్యలపై అవగాహన కల్పించాలని సూచించారు. సమావేశంలో ఐసీడీఎస్ పథక సంచాలకులు టి.కనకదుర్గ, సీడీపీఓలు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు.
శృంగవరపుకోట: జిందాల్ నిర్వాసితులు తమ పోరుబాటను కొనసాగిస్తున్నారు. కొందరు ఢిల్లీ వెళ్లి బుధవారం ధర్నా చేయగా, స్థానికంగా ఉన్నవారు బొడ్డవరలో యథావిధిగా తమ ఆందోళన కొనసాగించారు. కూటమి నేతలు కొర్పొరేట్ శక్తులకు దాసోహమయ్యారంటూ విమర్శించారు. జిందాల్‌కు ఇచ్చిన భూములు తిరిగి ఇచ్చివేయాలంటూ నినదించారు.

జాతీయ లోక్‌అదాలత్‌ను విజయవంతం చేయండి