
అటవీశాఖ రేంజ్ ఆఫీసర్‌గా రామ్‌నరేష్
విజయనగరం గంటస్తంభం: విజయనగరం జిల్లా అటవీశాఖ రేంజ్ ఆఫీసర్‌గా బి.రామ్‌నరేష్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ బి.అప్పలరాజు ఉద్యోగవిరమణ పొందడంతో ఆయన స్థానంలో విధుల్లో చేరారు. జిల్లా అటవీశాఖ కార్యాలయంలో అటవీశాఖ డీఎఫ్‌ఓ, సిబ్బంది ఆయనను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అటవీశాఖకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, నాణ్యమైన సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
ఫారెస్టు రేంజర్‌గా మణికంఠేష్
పార్వతీపురం: పార్వతీపురం ఫారెస్టు కార్యాలయంలో ఎలిఫెంట్ మానిటరింగ్ యూనిట్ (ఈఎంయూ)లో పనిచేస్తున్న మణికంఠేష్‌కు ఫారెస్టు రేంజర్‌గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ మేరకు బుధవారం ఆయన ఫారెస్టు కార్యాలయంలో రేంజర్‌గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో రేంజర్‌గా పనిచేసిన టి.రామ్‌నరేష్‌కు విజయనగరం అటవీశాఖ కార్యాలయానికి బదిలీ కావడంతో మణికంఠేష్‌కు బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా కార్యాలయం సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి పుష్పగుచ్ఛమిచ్చి అభినందించారు.
● మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ
పార్వతీపురంటౌన్: జిల్లాలోని మైనార్టీ వర్గాలకు చెందిన వివిధ చేతి వృత్తిదారులను ఆర్థికంగా ప్రోత్సహించే దిశగా ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద రుణ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకుడు షేక్ మహబూబ్ షరీఫ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 18 ఏళ్లు నిండిన మైనారిటీ వర్గాల్లోని ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు 18 రకాల వృత్తి పని చేసుకునే వారు ఈ పథకానికి అర్హులన్నారు. సంప్రదాయ కులవృత్తులైన వడ్రంగి, బంగారు ఆభరణాలు తయారు చేసే స్వర్ణకారులు, శిల్పాలు, విగ్రహాలు తయారుచేసే వారు, బుట్టలు, చాపలు, మట్టిపాత్రలు తయారుచేసే కుమ్మరులు, చీపుళ్ల తయారీదారులు, దోబీ, టైలర్, చేపల వలలు తయారు చేయువారు, చెప్పులు కుట్టేవారు, తాపీ కార్మికులు క్షవర వత్తిదారులు, సంప్రదాయ బొమ్మలు, పూలదండలు, పడవల తయారీదారులు, ఇంటి తాళాల తయారీదారులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు చెప్పారు. గతంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం వద్ద నుంచి ఎలాంటి రుణాలు తీసుకుని ఉండరాదని, కుటుంబంలో ఒకరు మాత్రమే ఈ పథకానికి అర్హులని, కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే పథకానికి అనర్హులని స్పష్టం చేశారు. ఆసక్తి, అర్హత గల వృత్తిదారులు తమ ధ్రువీకరణ పత్రాలతో మీ సేవ, సీఎస్సీ కేంద్రాల్లో www. pmvishwakarma.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు పాస్ పుస్తకం తప్పనిసరిగా కలిగి ఉండాలని, ఇతర వివరాల కోసం కార్యనిర్వాహక సంచాలకుడు, మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్, విజయనగరం వారిని సంప్రదించవచ్చని సూచించారు.

అటవీశాఖ రేంజ్ ఆఫీసర్‌గా రామ్‌నరేష్