
యూరియా.. ఏదయా!
రైతు పక్షాన
నేడు వైఎస్సార్‌సీపీ పోరుబాట
ఎరువుల కోసం అవస్థలు పడుతున్న రైతులు
గంటలకొద్దీ నిరీక్షిస్తే.. దొరికేది ఒక బస్తా
వీరఘట్టంలో ఎరువు కోసం వెళ్లిన
ఓ రైతుకు గాయాలు
ప్రైవేట్ వ్యాపారుల వద్ద పెద్ద ఎత్తున నిల్వలు
యథేచ్ఛగా అధిక ధరలకు విక్రయాలు
ఆర్డీఓ కార్యాలయాల్లో వైఎస్సార్‌సీపీ
వినతులు
●భామిని మండలంలో ఖరీఫ్ సాగు సాధారణ విస్తీర్ణం సుమారు 13 వేల ఎకరాలు కాగా పదివేల ఎకరాల్లో నాట్లు పడ్డాయి. మొత్తం సాగు విస్తీర్ణానికి 1,600 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా.. రైతు సేవా కేంద్రాల ద్వారా 240 మెట్రిక్ టన్నులు, ప్రైవేట్ డీలర్ల ద్వారా సుమారు 1,500 మెట్రిక్ టన్నుల ఎరువు
సరఫరా చేశారు. వాస్తవ సాగుకు కావాల్సిన
ఎరువులు మండలానికి వచ్చినప్పటికీ.. ప్రైవేటు డీలర్లు ఇతర మండలాలు, బయట ప్రాంతాలకు ఎక్కువ ధరకు అమ్ముకోవడంతో స్థానిక రైతులు సకాలంలో పంటలకు ఎరువు
అందించలేకపోతున్నారు.
●ఇటీవల పాలకొండలో ప్రైవేట్ డీలరు దుకాణంలో విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. దుకాణంలో అమ్మకాలకు సంబంధించి రికార్డులు నిర్వహించడం లేదని గుర్తించారు. అనుమతులు లేకుండా గోదాముల్లో నిల్వలను గుర్తించి, సీజ్ చేశారు. 127 బస్తాల యూరియా, 15 బస్తాల డీఏపీని పట్టుకోగా.. వీటి విలువ రూ.3.25 లక్షలు.
పార్వతీపురం మండలం వెంకంపేట రెవెన్యూ పరిధిలో సాగు చేస్తున్న రైతులు యూరియా దొరక్క అమ్మోనియా, దుబ్బు గుళికలు కలిపి చేలకు చల్లుకునే దుస్థితి
ఏర్పడింది. సరఫరా చేసిన అరకొర యూరియా పలుకుబడి ఉన్నవారికే దొరుకుతుందని.. తామైతే నల్లబజారులో బస్తాకు రూ.200 అదనంగా ఇచ్చి ఒకట్రెండు బస్తాలు తెచ్చుకోగలిగామని ఇక్కడి రైతులు
చెబుతున్నారు.
సీతానగరం మండలంలో రైతులకు
ఎరువులు దొరకడం లేదు. ఇటీవల తామరకండి, రామవరం పరిధిలో యూరియా ఇవ్వడంతో వందలసంఖ్యలో గుమికూడారు. దీంతో తోపులాట చోటుచేసుకుంది.
పోలీసులు చేరుకుని.. 250 మందికి..
ఒక్కొక్కరికి బస్తా చొప్పున దగ్గరుండి
పంపిణీ చేయించారు.
సోమవారం జిల్లావ్యాప్తంగా ఎరువుల కోసం రైతులు గంటలకొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి దాపురించింది. ఉదయం 6 గంటల నుంచే పంపిణీ కేంద్రాల వద్ద క్యూ కట్టారు. వీరఘట్టంలో ఓ రైతు చేతికి
గాయాలయ్యాయి.
కొద్ది రోజుల కిందట సాలూరు మండలంలోని మామిడిపల్లిలో పలు ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. పోలమాంబ రైతు డిపోలో ఈ–పాస్
యంత్రంలో చూపిన నిల్వల కంటే గోదాములో రూ.4 లక్షల విలువ చేసే ఎరువులు అధికంగా ఉన్నట్లు గుర్తించి, సీజ్ చేశారు. మక్కువ మండలంలోనూ ప్రైవేట్ వర్తకుల వద్ద పెద్ద ఎత్తున అనధికార నిల్వలను గుర్తించారు. ఇటీవల పాచిపెంట మండలంలో పీఏసీఎస్ అధ్యక్షుడే స్వయంగా ఆటోతో లోడును
తరలిస్తుండగా విజిలెన్స్ అధికారులు
పట్టుకున్నారు.

యూరియా.. ఏదయా!

యూరియా.. ఏదయా!

యూరియా.. ఏదయా!