
తెరచాటుకు కోటదుర్గమ్మ
పాలకొండ: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం పాలకొండ కోటదుర్గమ్మ వారు సోమవారం నుంచి తెరచాటుకు వెళ్లారు. దసరా ఉత్సవాలు ఈ నెల 22 నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్న నేపథ్యంలో ఆనవాయితీ ప్రకా రం అమ్మవారి విగ్రహానికి తెరవేశారు. ఈ 14 రోజులు అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని మాత్ర మే భక్తుల దర్శనార్థం ఉంచుతారు. గ్రహణ సంప్రోక్షణ అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి గర్భగుడికి తెరవేశారు. తిరి గి ఈ నెల 22న అమ్మవారి నిజరూప దర్శనం ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకుడు దార్లపూడి లక్ష్మీప్రసాద్‌శర్మ తెలిపారు.
సీతానగరం: ప్రజల సమస్యలను నేరుగా తెలుకుని పరిష్కరించేందుకు కృషిచేస్తున్నట్టు కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ అన్నారు. సూరంపేట గ్రామ రామమందిరం వద్ద సోమవారం రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించా రు. రైతు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఎరువుల కొరత లేదని, తొందరపడి అధిక ధరలకు కొనుగోలు చేయవద్దన్నారు. రైతులకు సీసీఆర్సీ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్‌పాల్, తహసీల్దార్ ప్రసన్నకుమార్, ఏఓ ఎస్.అవినాష్, వ్యవసాయ సహాయకులు, సూ రంపేట, చిన్నారాయుడు, మరిపివలస గ్రామాల రైతులు పాల్గొన్నారు.
వీరఘట్టం: యూరియా కోసం రైతులు ఆందోళ న చెందవద్దని జిల్లా వ్యవసాయశాఖ అధికారి రాబర్ట్‌పాల్ అన్నారు. వీరఘట్టం కూరాకులవీధికి వెళ్లి రైతులతో మాట్లాడారు. యూరియా పంపిణీలో అధికారులకు సహకరించాలని కోరారు. ప్రస్తుతం గ్రోమోర్ సెంటర్‌లో ఉన్న యూరియాను మంగళవారం అందజేస్తామన్నారు.
సీతంపేట: సుమారు 18 అడుగుల పొడవు ఉన్న కింగ్‌కోబ్రా సీతంపేటలో ని ఓ ప్రైవేటు నర్సరీ పంప్ షెడ్ గదిలో తిష్టవేసింది. సామగ్రి తీసేందుకు గదిలోకి వెళ్లిన నర్సరీ యజమాని భుజంగరావు పామును చూసి భయపడ్డారు. వెంట నే అటవీశాఖ అధికారులకు సమాచారమిచ్చారు. శ్రీకాకుళం నుంచి స్నేక్‌క్యాచర్స్ ఖాన్, అశోక్ వచ్చి కింగ్‌కోబ్రాను పట్టుకున్నారు. కొత్తూరు–బత్తిలి రిజర్వ్ ఫారెస్టు పరిధిలో విడిచిపెట్టినట్టు ఎఫ్‌బీఓ దాలినాయుడు తెలిపారు. ఇది విషపూరితమైన పాముగా పేర్కొన్నారు.

తెరచాటుకు కోటదుర్గమ్మ

తెరచాటుకు కోటదుర్గమ్మ