
అన్నదాత ఉసురు తగులుతుంది
కొమరాడ: మండలంలోని గిరిశిఖర గ్రామాలైన కుంతేస్, పూడేస్, పెదశాఖ, నయా తదితర గ్రామాల రైతుల యూరియా కోసం ఉదయం 7 గంటలకే ఆర్‌ఎస్‌కేలు, ప్రైవేటు దుకాణాల వద్ద పడిగాపులు కాసినా ఎరువు దొరకని పరిస్థితి నెలకొందని, రైతుల ఉసురు కూటమి ప్రభుత్వానికి తగులుతుందని సీపీఎం నాయకులు కొల్లు సాంభమూర్తి, గిరిజన సంఘ నాయకుడు చోడి ఆనంద్ అన్నారు. కొమరాడ గ్రోమోర్ సెంటర్ వద్ద ఎరువు కోసం పడిగాపులు కాసినా చాలా మంది రైతులకు ఎరువు లభించకపోవడంతో ఆందోళన వ్యక్తంచేశారు.
కొమరాడలో యూరియా కోసం
వేచిఉన్న గిరిజనులు

అన్నదాత ఉసురు తగులుతుంది