ఎరువుల బాధ్యత ప్రభుత్వానిదే | - | Sakshi
Sakshi News home page

ఎరువుల బాధ్యత ప్రభుత్వానిదే

Sep 7 2025 7:18 AM | Updated on Sep 7 2025 7:18 AM

ఎరువుల బాధ్యత ప్రభుత్వానిదే

ఎరువుల బాధ్యత ప్రభుత్వానిదే

ఎరువుల బాధ్యత ప్రభుత్వానిదే

సాలూరు రూరల్‌: ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభంలోనే అందించాల్సిన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, యంత్రపరికరాలు సిద్ధం చేసి రైతులకు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అన్నంపెట్టే రైతును ఆదుకుంటేనే అందరి కడుపులు నిండుతాయి. అలాంటిది సెప్టెంబర్‌ నెల వచ్చినా ఇంకా ఎరువుల కోసం రైతు క్యూలో కాలం వెళ్ల దీయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది కచ్చితంగా ప్రభుత్వం అన్నదాతపై చూపిస్తున్న నిర్లక్ష్యమేనని మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం ఆయన తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రైతు బాంధవుడినని చెప్పుకుంటారని, ప్రస్తుతం రైతులు యూరియా కోసం పడుతున్న తిప్పలు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి రైతుపై ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తున్నాయన్నారు. పలు సందర్భాల్లో వ్యవసాయం దండగ అన్న చంద్రబాబునాయుడు ఇప్పుడు ఆయన అనుసరిస్తున్న విధానాలతో స్పష్టం చేస్తున్నారన్నారు.

ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు

ఏసీ గదుల్లో కూర్చుని నిర్ణయాలు తీసుకుంటే రైతు కష్టాలు ఎలా తెలుస్తాయి? రోడ్డు మీదకి వచ్చి రైతు ఎరువుకోసం ఎన్ని పాట్లు పడుతున్నాడో చూస్తే అర్థం అవుతుంది. ప్రస్తుతం యూరియా పూర్తిస్థాయిలో ఇచ్చేస్తున్నామని చెబుతున్న వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెంనాయుడికి ఆ యూరియా ఎక్కడికి పోతోందో తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు.

గత ప్రభుత్వంలో ఆర్బీకేల్లో సేవలు

గత ప్రభుత్వంలో రైతుభరోసా కేంద్రాల్లో రైతుకు సీజన్‌ ప్రారంభంలోనే ఎరువులు, విత్తనాలు ఏమేరకు అవసరమో సిద్ధం చేసి ఉండేవన్నారు. ఇప్పుడు ఆ రైతు భరోసా కేంద్రాలను కొన్ని చోట్ల అద్దెలకు ఇచ్చేస్తున్నట్లు పత్రికల్లో చూస్తున్నామన్నారు.

ఫేక్‌న్యూస్‌లైతే అనుకూల పత్రికలపై కేసులు పెట్టండి

పత్రికల్లో ఎరువుల కోసం వచ్చిన వార్తలు అన్ని అబద్ధాలేనని కొట్టిపారేస్తున్న మంత్రులు ప్రభుత్వ అనుకూల పత్రికల్లో దారిమళ్లిన ఎరువులు అని బ్యానర్‌ వార్తలు రాసిన పత్రికలపై ముందు కేసులు పెట్టాలన్నారు. మీకు అనుకూల పత్రికల్లో కూడా వైఎస్సీర్‌సీపీ నాయకులే రాయించేశారా? అని రాజన్నదొర ప్రశ్నించారు సమావేశంలో మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ వంగపండు అప్పలనాయుడు, కౌన్సిలర్‌ గిరి రఘు, మాజీ కౌన్సిలర్‌ పిరిడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement