
మంచిసినిమాలను ప్రోత్సహించాలి
సాలూరు: మంచి సినిమాలకు ప్రభుత్వం రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలని వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర కోరారు. పీపుల్స్ స్టార్ ఆర్‌నారాయణమూర్తి దర్శకత్వం వహించిన యూనివర్సిటీ పేపర్‌లీక్ సినిమాను నారాయణమూర్తితో పాటు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టణంలో గురువారం రాజన్నదొర చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నారాయణమూర్తి ఎప్పుడూ మంచి చిత్రాలనే తీస్తుంటారని, సామాజిక అంశాలపై ఆయన తీసే సినిమాలు ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నాయన్నారు. ఇటువంటి మంచి సినిమాలు మరిన్ని రావాలంటే ప్రభుత్వం ఇటువంటి సినిమాలను ప్రోత్సహించాలని కోరారు. తమ సినిమాను నేరుగా వచ్చి చూడడంతో పాటు తన వెంట అధిక సంఖ్యలో అభిమానులతో సినిమా చూసిన రాజన్నదొరకు నారాయణమూర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర