
మంత్రి మాట కాలేదు.. ఆ సంతకం చెల్లలేదు!
గత ఏడాది ఆగస్టు 12వ తేదీన కలెక్టరేట్‌లో జరిగిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వచ్చా రు. ఆ సమయంలో పూర్తిగా కాళ్లు చచ్చుబడిపో యి, మంచానికే పరిమితమైన దివ్యాంగుడు జియ్యమ్మవలస మండలం శింగనాపురం గ్రామానికి చెందిన రవికుమార్ కుటుంబసభ్యుల సాయంతో వచ్చాడు. తనకు రూ.6 వేల పింఛన్ మాత్రమే వస్తోందని.. కదల్లేని స్థితిలో ఉన్నవారికి ఇస్తున్న రూ.15 వేలు మంజూరు చేయాలని మంత్రికి విజ్ఞప్తి చేశాడు. రవికుమార్ స్థితిని చూసి చలించిన మంత్రి సంధ్యారాణి సైతం.. వినతి పత్రం తీసుకుని, స్వయంగా సంతకం చేసి.. అక్కడే ఉన్న డీఎంహెచ్‌ఓకు వంద శాతం వికలాంగత్వం కింద రాసి, పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు. ఆ నియోజకవర్గ శాసనసభ్యురాలు తోయక జగదీశ్వరి సైతం అప్పుడు అక్కడే ఉన్నా రు. దాదాపు ఏడాది కావస్తోంది. మంత్రి మాట కాలేదు.. ఆ సంతకం చెల్లలేదు. ఇప్పటికీ అధికారుల చుట్టూ ఆ కుటుంబ సభ్యులు తిరుగుతూనే ఉన్నారు. ఈ సోమవారం పీజీఆర్‌ఎస్ కార్యక్ర మానికి వచ్చి వినతి అందించారు.
– సాక్షి, పార్వతీపురం మన్యం

మంత్రి మాట కాలేదు.. ఆ సంతకం చెల్లలేదు!