
●ముగ్గురున్నా ఒక్కరికీ తల్లికివందనం అందలేదు..
చిత్రంలో తమ ఆవేదన వ్యక్తంస్తున్నది పిరిడి సింహాచలం, ఆయన భార్య. సీతానగరం మండ లం గాదెలవలస గ్రామం. వీరికి ముగ్గురు పిల్లలు. అర్హత ఉన్నప్పటికీ.. ఏ ఒక్కరికీ తల్లికి వందనం పథకం అందలేదు. హౌస్ హోల్డ్ మ్యాపింగ్‌లో వీరి కుటుంబంలో మరో ప్రభుత్వ ఉద్యోగి డేటా కలిసిపోవడమే కారణం. ఆధార్ కూడా లింకై పోవడంతో కరెంటు వినియోగం అధికంగా ఉందని, ప్రభుత్వ ఉద్యోగి ఇంట్లో ఉన్నారని చెబుతూ పథకానికి దూ రం చేశారు. తమకు న్యాయం చేయాలని అధికారు ల చుట్టూ సింహాచలం దంపతులు తిరుగుతున్నా ఫలితం ఉండడం లేదు.