
● మా పాఠశాలకు టీచర్ లేరు..
మా పాఠశాలకు టీచర్ లేరు.. ఎలా చదువుకోవాలో తెలియడంలేదంటూ కురుపాం మండలం జొంగరపాడు గ్రామంలోని గిరిజన సంక్షేమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. రోజూ పాఠశాలకు వస్తున్నా టీచర్ రావడంలేదంటూ వాపోయారు. విద్యా సంవత్సరం ప్రారంభమై సుమారు 40 రోజులు గడుస్తున్నా పాఠశాలకు టీచర్‌ను నియమించడంలో ఐటీడీఏ అధికారుల నిర్లక్ష్యం సుమారు 12 మంది విద్యార్థుల చదువుకు ప్రతిబంధకంగా మారింది. తక్షణమే టీచర్‌ను నియమించాలని, లేదంటే ఆందోళనకు దిగుతామని విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు. –గుమ్మలక్ష్మీపురం(కురుపాం)