
లక్కీడిప్ విజేతలకు నగదు బహుమతులు
విజయనగరం ఫోర్ట్: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ నెల 11న నిర్వహించిన లక్కీడిప్ లో బహుమతులకు ఎంపికై న వారికి చెక్కులు, సర్టిఫికెట్లను కలెక్టర్ డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ సోమ వారం అందజేశారు. పీపీఐయూసీడీలు ఎక్కువ మందికి వేసినందుకు చీపురుపల్లి ఏరియా ఆస్పత్రి గైనకాలజిస్ట్ డాక్టర్ ఎ.వి.ఎస్.ఉషారాణికి రూ.8 వేలు, వేసెక్ట్‌మీ ఆపరేషన్స్ ఎక్కువ చేసిన పోలిపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి టి.తిరుపతిస్వామికి రూ.7 వేలు, ఆర్‌ఎంఎన్‌సీహెచ్+ఏ కౌన్సిలర్ ఎ.నాగమణి కి రూ.2,500లు, మోటివేటర్ ఎంఎల్‌హెచ్‌పీ ఎస్.రమ్యకు రూ.2,500, బెస్ట్ మోటివేటర్ ఎంపీహెచ్‌ఏ (ఎఫ్) ఏఎస్‌ఎం ఎం.ఎరుకలమ్మకి రూ.2,500, మోటివేటర్ ఆశకు రూ.2,500లు, ముగ్గురు పిల్లల కంటే ఎక్కువ మంది సంతానం కలిగిన చంద్రకళ, పైడితల్లి, సునీతలకు రూ.5వేలు చొప్పున, పీపీఐయూసీడీ యాక్సెప్టర్ ఎ.హేమలతకు రూ.5వేలు, వేసెక్టమీ యాక్సెప్టర్ ఆడపా సురేష్‌కి రూ.5వేలు, ఇంజెక్టబుల్ యాక్సెప్టర్ వానపల్లి రమ్యకు రూ.5 వేలు చొప్పున చెక్కులను కలెక్టర్‌తో కలిసి డీఎంహెచ్‌ఓ జీవనరాణి అందజేశారు. ఇన్‌చార్జి గణాంకాధికారి సంధ్యారాణి పాల్గొన్నారు.