
●ఎరువు కోసం రైతుల పాట్లు
రైతులను ఎరువు కష్టాలు వీడడం లేదు. పొలంలో పనిచేసుకునే సమయంలో
ఎరువు కోసం తిరగాల్సి వస్తోంది. దీనికి సాలూరు మండలం శివరాంపురం గ్రామం పీఏసీఎస్ వద్ద సోమవారం రైతులు పడిగాపులు కాస్తున్న ఈ చిత్రమే సజీవసాక్ష్యం. పీఏసీఎస్ వద్ద ఎరువు పంపిణీ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే, అందరికీ ఎరువు అందకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. గత ప్రభుత్వ హయాంలో
ఆర్‌బీకేలలో కావాల్సినంత ఎరువు సరఫరా చేసేవారని, ఇప్పుడు ఎరువుకోసం కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తంచేశారు. – సాలూరు రూరల్