
సర్దుబాటుతో ఖాళీ పోస్టుల భర్తీ
సాక్షి, పార్వతీపురం మన్యం: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులు.. ఉపాధ్యాయుల కోసం వేచి ఉండే పరిస్థితి రాకుండా చూడాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయు ల కొరత ఉన్న చోట సర్దుబాటు చేసుకోవాలని విద్యాశాఖాధికారిని ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతీ ఒక్క ఉపాధ్యాయుడు తప్పకుండా విధులకు హాజరుకావాలని.. గైర్హాజరు అయితే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యార్థులు రెండు, మూడు రోజులు పాఠశాలలకు హాజరు కానట్లయితే.. వారి బాగోగులు తెలుసుకొని, అవసరమైతే వైద్య సిబ్బందిని పంపి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాల కారణంగా నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న కాలువలు, గెడ్డలు, వాగులు దాటే సమ యంలో విద్యార్థులు ప్రమాదాలకు గురయ్యే అవకా శం ఉందని, అటువంటి సమయంలో అవసరమైతే విద్యార్థులకు సెలవును ప్రకటించాలని సూచించా రు. ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దడంలో పంచాయ తీ శాఖ క్రియా శీలకంగా ఉండాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
పచ్చిరొట్ట ఎరువుతో మట్టికి జీవం
పచ్చిరొట్ట ఎరువుతో మట్టికి జీవం కలుగుతుందని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ అన్నారు. వ్యవసాయశాఖ రూపొందించిన ‘పచ్చిరొట్ట పైర్లను వాడటం ద్వారా 25 శాతం ఎరువులు ఆదా’ అనే పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు. నానో యూరియా, ఎరువులతో రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు.