మక్కువ: మండలంలోని డి.శిర్లాం, గోపాలపురం గ్రామాల సమీపంలోని ఓ పామాయిల్‌తోటలో గడ్డి నివారణ కోసం మందును రైతు పిచికారీచేయడంతో, పంటపొలంలోని ఆ గడ్డిని తిని ఏడు మేకలు సోమవారం మృతిచెందాయి. గ్రామానికి చెందిన గొర్రెల కాపరులు మేతకోసం సుమారు 200గొర్రెలు, మేకలను పంటపొలాల వైపు తరలించారు. పామాయిల్ తోటలో గడ్డిని మేకలు మేస్తుండగా, ఒక్కసారిగా అస్వస్థతకు గురి కాగా వాటిలో ఏడు మేకలు అక్కడికక్కడే మృతిచెందాయి. విషయం తెలుసుకున్న పశువైద్యసిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని అస్వస్థతకు గురైన మేకలకు వైద్యచికిత్స అందించారు. మృతిచెందిన ఏడు మేకల విలువ సుమారు రూ.2లక్షల వరకు ఉంటుందని గొర్రెల కాపరులు లబోదిబోమన్నారు.