
లైసెన్స్ రద్దు చేస్తాం
దుకాణాల్లో నకిలీ ఎరువులు, పురుగు మందులు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే దుకాణం లైసెన్స్ రద్దు చేస్తాం. మందులు కొనుగోలు చేసిన రైతులకు దుకాణం పేరుతో పాటు యజమాని సంతకంతో కూడిన బిల్లు తప్పనిసరిగా ఇవ్వాలి. పురుగు మందులు తీసుకునేటప్పుడు డబ్బాపై ఉన్న వివరాలను పూర్తిగా పరిశీలించాలి. చదువు రాని వారు తెలిసిన వారికి చూపించి అది ఏ కంపెనీదో నిర్ధారించిన తర్వాతనే కొనుగోలు చేయాలి. వ్యవసాయాధికారుల సూచన ప్రకారమే మందు పిచికారీ చేయాలి. లేకుంటే పంట దెబ్బతినే ప్రమాదం ఉంది.
శ్యామ్‌ప్రసాద్, ఏడీఏ, బొబ్బిలి