
ప్లాస్టిక్ సంచుల గొడౌన్‌లో అగ్నిప్రమాదం
● అదుపులోకి రాని మంటలు
● ప్రయత్నిస్తున్న ఫైర్ సిబ్బంది
వీరఘట్టం: వీరఘట్టం యూనియన్ బ్యాంకు పక్కనే ఉన్న ప్లాస్టిక్ సంచుల గొడౌన్‌లో శుక్రవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. గొడౌన్‌లో విలువైన ప్లాస్టిక్ పైపులతో పాటు పాలిథిన్ సంచులకు నిప్పు అంటుకోవడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి.ఈ మంటలను అదుపు చేసేందుకు పాలకొండ ఫైర్ ఆఫీసర్ జామి సర్వేశ్వరరావు తన సిబ్బందితో వచ్చి అదుపు చేసే ప్రయత్నం చేశారు. అయితే మంటలు అదుపు కాకపోవడంతో పాటు రెట్టింపు మంటలు చెలరేగడంతో సమీప ఇళ్ల వారు భయాందోళన చెందుతున్నారు. అయితే అగ్నిప్రమాదం ఏవిధంగా జరిగిందో తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదాన్ని చూసేందుకు స్ధానికులు సంఘటనా స్ధలానికి రావడంతో ఫైర్ అధికారులకు కొంత ఆటంకం కలిగింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.18 లక్షల ఆస్తినష్టం జరిగినట్లు గొడౌన్ యజమాని వాపోతున్నాడు.

ప్లాస్టిక్ సంచుల గొడౌన్‌లో అగ్నిప్రమాదం