
వ్యవసాయంలో మక్కువకు గుర్తింపు
మక్కువ: వ్యవసాయ పరిశోధనల్లో ‘మక్కువ’కు గుర్తింపు లభించింది. మండలంలోని చప్పబుచ్చమ్మపేటకు చెందిన వైకుంఠపు పాపారావు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ (ఐసీఏఆర్)లో వ్యవసాయశాస్త్రవేత్తగా ఉద్యోగం చేస్తూ చేసిన పరిశోధనలు జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చాయి. రాష్ట్రీయకృషి విజ్ఞాన్ పురస్కార్–2025 వరించింది. ఢిల్లీలో కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ చేతులమీ దుగా పాపారావు బుధవారం అవార్డు అందుకున్నారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రైస్ (ఐసీఏఆర్) స్థాపన దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలకు అవార్డులను ప్రదానం చేశారు.
●ఆనందంగా ఉంది
మాది వ్యవసాయ కుటుంబం. తల్లిదండ్రులు వైకుంఠపు అప్పలనాయుడు, పార్వతి వ్యవసాయదారులు. చిన్న ప్పటి నుంచి వ్యవసాయం అంటే మక్కువ. వ్యవసాయశాస్త్రవేత్తగా 2020 సంవత్సరంలో ఉద్యోగం సాధించా ను. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఐసీఏఆర్‌లో శాస్త్రవేత్తగా విధులు నిర్వర్తిస్తున్నాను. వ్యవసాయ పరిశోధనలకు రాష్ట్రీయ కృషి విజ్ఞాన్ పురస్కారం వరించడం గౌరవంగా భావిస్తున్నా. – డాక్టర్ వైకుంఠపు పాపారావు
అవార్డుతో వ్యవసాయ శాస్త్రవేత పాపారావు