
విద్యుత్ స్టేవైరు తగిలి గేదె మృతి
సీతానగరం: మండలంలోని తామరఖండి గ్రామంలో ఇళ్ల సర్వీసుల నిమిత్తం విద్యుత్ స్తంభానికి సపోర్టుగా వేసిన విద్యుత్ స్టే వైరు తగిలి రూ.80వేల ఖరీదైన గేదె మృతిచెందింది. ఈ ఘటనపై స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పాడి రైతు గుంట్రెడ్డి అప్పలనాయుడికి చెందిన గేదెను మేతకు తోలి ఇంటికి తీసుకువచ్చి ఇంటి ముందున్న తాడుకు కట్టాడు. వర్షం కురుస్తున్న సందర్భంగా నేల నాని పోవడంతో పక్కేనే ఉన్న విద్యుత్ స్తంభానికి బిగించిన స్టేవైరుకు పింగాణీ లేక పోవడంతో స్టే వైరుకు ప్రవహించిన విద్యుత్ గేదె మెడ, కొమ్ముకు తగలడంతో మృతిచెందినట్లు తెలియ జేశారు.
గుర్తు తెలియని వ్యక్తి
మృతదేహం లభ్యం
బాడంగి: మండలంలోని ముగడ పంచాయతీ పరిధి విమానాశ్రయం రన్‌వే గచ్చు తుప్పల్లో కుళ్లిపోయిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు బుధవారం కనుగొన్నారు. ఈ విషయాన్ని వీఆర్‌ఓ ద్వారా పోలీసులకు సమాచార మివ్వగా ఎస్సై తారకేశ్వరరావు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశిలించి మృతదేహం గుర్తు పట్టలేని విధంగా కుళ్లిపోయి కపాలం, ఎముకలు బయటకు కనిపించడంతో ఆ వ్యక్తి సుమారు 15రోజులక్రితమే చనిపోయి ఉంటాడని, ఆయన వయస్సు సుమారు 50–55మధ్య ఉంటుందని అంచనాకు వచ్చారు. తొలుత ఆనుమానాస్పద మృతిగా భావించి విజయనగరం నుంచి క్లూస్‌టీమ్‌ను రప్పించి పరిశీలించగా మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండడంతో వారు కూడా చేసేది లేక తిరుగుముఖంపట్టారు. మృతదేహాన్ని ఆస్పత్రికి కూడా తీసుకువెళ్లలేని పరిస్థితుల్లో ఆక్కడికే స్థానిక సీహెచ్‌సీ వైద్యాధికారి నాగేశ్వరావును రప్పించి పోస్టుమార్టం చేయించి సమీపంలోనే జేసీబీతో గొయ్యితీసి పూడ్చిపెట్టారు. అయితే కొద్దరోజులక్రితం మతిస్థిమితం లేని బిచ్చగాడు ఇటువైపు తిరుగుతుండేవాడని పలువురు చెప్పగా అయి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ఎస్సై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
14మంది జూదరుల అరెస్టు
బొండపల్లి: మండలంలోని వెదురువాడ గ్రామం వద్ద జూదం ఆడుతుండగా 14మందిని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్సై యు.మహేష్ తెలిపారు. వారి నుంచి రూ.లక్షా 1170 నగదు, 9సెల్‌ఫోన్‌లు, 14మోటార్ సైకిల్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. పట్టుకున్న వారి పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

విద్యుత్ స్టేవైరు తగిలి గేదె మృతి

విద్యుత్ స్టేవైరు తగిలి గేదె మృతి