
ఐద్వా 9వ మహాసభలు విజయవంతం చేయాలి
● వాల్‌పోస్టర్ విడుదల
విజయనగరం గంటస్తంభం: ఆగస్టు 19న విజయనగరంలో జరిగే అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఐద్వా 9వ మహాసభలను విజయవంతం చేయాలని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు, కార్యదర్శి కె.పుణ్యవతి, పి.రమణమ్మలు కోరారు. ఈ మేరకు మంగళవారం స్ధానిక ఎల్బీజీ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ముందుగా సంఘం ఉపాధ్యక్షురాలు ఆర్.కృష్ణవేణి, సహాయ కార్యదర్మి వి.లక్ష్మి మహాసభ వాల్‌పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మహిళాహక్కులు, మహిళలకు 33శాతం రిజర్వేషన్, అధిక ధరలకు వ్యతిరేకంగా, ప్రజాసమస్యల పరిష్కారం కోసం మహిళలపై జరిగే దాడులు, హత్యలు, ఆత్యాధారాలు, లైంగిక, వరకట్న వేధింపులు, సీ్త్రవివక్ష, డ్వాక్రామహిళల సమస్యలు, మైక్రోఫైనాన్స్, మద్యం, గంజాయి, డ్రగ్స్, అశ్లీలత మొదలైన సమస్యలపై జిల్లావ్యాప్తంగా ఉద్యమాలు, పోరాటాలు ఐద్వా నిర్వహించిందని వివరించారు.