
ఎరువుల పంపిణీ
సీతానగరం: మండలంలోని కాశీపేటలో ఎరువుల పంపిణీని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. అనంతరం పొలం పిలుస్తోంది కార్యక్రమంలో పాల్గొన్నారు. యూరియాను అధిక మోతాదులో వినియోగించవద్దని రైతులకు సూచించారు. ఎరువులు పూర్తిస్థాయిలో సరఫరా చేస్తామని చెప్పారు. జిల్లాలో 11వేల సీసీఆర్‌సీ కార్డులు జారీచేయాలన్నది లక్ష్యంకాగా 5,985 కార్డులు జారీచేసినట్టు వెల్లడించారు. జూలై చివరి నాటికి జిల్లాలో దాదాపు 11,327 టన్నుల యూరియా అవసరమవుతుందని అంచనా వేయగా, ఇప్పటివరకు 10,084 టన్నులు వచ్చినట్టు తెలిపారు. రైతులకు సమస్యలు ఎదురైతే జల్లా వ్యవసాయశాఖ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ నంబర్: 79894 34766కు కాల్‌చేయాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయాధికారులు డాక్టర్ రాబర్ట్, ఎస్.అవినాష్, తహసీల్దార్ ప్రసన్నకుమార్, ఎంపీడీఓ ఎంఎల్‌ఎన్ ప్రసాద్, సర్పంచ్ తేలు ధనంజయమ్మ, తేలు చంద్రశేఖర్, ఆర్‌ఐ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.